క్రీడాభూమి

రాణించిన నేమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: ఒలింపిక్స్ సాకర్‌లో బ్రెజిల్‌కు మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయి. మహిళల విభాగం సెమీ ఫైనల్‌లో ఓటమిపాలైన బ్రెజిల్ పురుషుల విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్టార్ ఆటగాడు, కెప్టెన్ నేమార్ రెండు గోల్స్ చేసి, హోండురాస్‌పై బ్రెజిల్ 6-0 తేడాతో ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ మొదటి నిమిషంలోనే నేమార్ చేసిన గోల్‌తో 1-0 ఆధిక్యాన్ని సంపాదించిన బ్రెజిల్ రెట్టించిన ఉత్సాహంతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. గాబ్రియల్ జీసస్ 26, 35 నిమిషాల్లో గోల్స్ చేసి, బ్రెజిల్ ఆధిక్యాన్ని 3-0కు చేర్చాడు. 51వ నిమిషంలో మారాక్వినోస్, 79వ నిమిషంలో లువాన్ చేసిన గోల్స్‌తో బ్రెజిల్ తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. జట్టు సభ్యులకు మార్గదర్శిగా నిలిచిన నేమార్ మ్యాచ్ ముగింపు దశలో మరో గోల్ చేశాడు. హోండురాస్‌ను పూర్తి ఆత్మరక్షణలోకి నెట్టి, తిరుగులేని విజయాన్ని సాధించిన బ్రెజిల్ టైటిల్ కోసం జర్మనీతో పోరాడుతుంది. మరో సెమీ ఫైనల్‌లో జర్మనీ 2-0 గోల్స్ తేడాతో నైజీరియాపై విజయం సాధించింది.

చిత్రం.. రెండు గోల్స్: నేమార్‌