క్రీడాభూమి

క్షణక్షణం ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: రియో ఒలింపిక్స్ మహిళల బాడ్మింటన్ సింగిల్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన తెలుగు అమ్మాయి పివి సింధు స్వదేశానికి బయలుదేరిందన్న వార్త విన్న క్షణం నుంచే హైదరాబాద్‌లో ఉత్కంఠ నెలకొంది. సింధుకు స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది. గచ్చిబౌలి స్టేడియంలో ఆమెకు సన్మాన కార్యక్రమానికి జిహెచ్‌ఎంసి అన్ని ఏర్పాట్లు చేసింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, మెహదీపట్నం మీదుగా గచ్చిబౌలి వరకూ జరిగే భారీ ర్యాలీని తిలకించేందుకు వేలాదిగా అభిమానులు తరలిరానున్నారు. ఒలింపిక్స్ ఇండివిడ్యువల్ ఈవెంట్‌లో భారత్‌కు రజతాన్ని అందించిన తొలి మహిళగా రికార్డు సృష్టించిన సింధు పేరు యావత్ దేశంలో మారుమోగుతున్నది. నజరానాలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి సింధు స్వదేశానికి పయనమైన మరు క్షణం నుంచే హైదరాబాద్‌లో పండుగ వాతావరణం కనిపిస్తున్నది. ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో వరుసగా రెండు కాంస్య పతకాలు, ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన తొలిసారే రజతం సింధు సామర్థ్యానికి నిలువెత్తు సాక్ష్యాలు. 21 ఏళ్లలోనే ప్రపంచ ర్యాంకింగ్స్ ‘టాప్-10’లో స్థానం సంపాదించిన సింధు సోమవారం ఉదయం నగరానికి చేరుకుంటుంది. ఆమెకు ఘన స్వాగతం చెప్పేందుకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అధికారులు విమానాశ్రయానికి చేరుకుంటారు. వేలాది మంది అభిమానులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు రోడ్లకు ఇరువైపులా బారులు తీరి ఆమెకు జేజేలు పలుకుతారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగే సన్మాన కార్యక్రమానికి కూడా భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది.