క్రీడాభూమి

ఘనస్వాగతానికి శాట్ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు నగరానికి వస్తున్న సందర్భంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్), తెలంగాణ బాడ్మింటన్ సంఘం సంయుక్తంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. సింధు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు విమానంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటుంది. విమానాశ్రయంలో ఆమెకు తెలంగాణ బాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు ఘనస్వాగతం పలుకుతారు. కాగా, సింధును ఆహ్వానించేందుకు శాట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గచ్చిబౌలీ స్టేడియం వరకు భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి రాజేంద్రనగర్, ఆరాంఘర్, అత్తాపూర్, మెహిదీపట్నం, టోలీచౌకీ మీదుగా గచ్చిబౌలీ స్టేడియానికి సింధు చేరుకుంటుంది. ఈ మార్గాన్ని అధికారులు పరిశీలించారు. ప్రధాన కూడళ్ల వద్ద వివిధ పాఠశాలలు, కాలేజీల విద్యార్థినీ విద్యార్థులు, పౌరులు పెద్ద ఎత్తున సింధుకు స్వాగతం పలికేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సింధు రాక సందర్భంగా జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్థన్ రెడ్డి, శాట్ ఇన్‌చార్జి విసి, ఎండి మహ్మద్ అజీమ్ తదితరులు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులతో సమావేశమయ్యారు. గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి స్టేడియంలో సోమవారం ఉదయం 11.30 గంటలకు జరుగనున్న సింధు పౌరసన్మానం ఏర్పాట్లను వారు సమీక్షించారు. సన్మాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హాజరై సింధును సత్కరిస్తారని శాట్ అధికారులు తెలిపారు. కాగా, సింధు తన తల్లితండ్రులు రమణ, విజయతో పాటు కోచ్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి పుల్లెల గోపిచంద్‌తో కలిసి గోపిచంద్ బాడ్మింటన్ అకాడమీలో జరుగనున్న విలేఖరుల సమావేశంలో పాల్గొంటుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి గచ్చిబౌలికి చేరుకున్న సింధును ప్రభుత్వం, గోపీచంద్ అకాడమీ సింధును ఘనంగా సత్కరించనున్నాయి.

హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో సోమవారం జరిగే సింధు సన్మాన సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఇతర అధికారులు