క్రీడాభూమి

బైబై రియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 21: సజావుగా సాగుతాయా లేదా అన్న అనుమానాల మధ్య ఆరంభమైన రియో ఒలింపిక్స్ ఆదివారం ముగిశాయి. 2020లో ఆతిథిమిస్తున్న టోక్యోకు ఒలింపిక్ సంబరం అధికారికంగా తరలి వెళ్లింది. మొత్తం 207 దేశాల నుంచి వచ్చిన 11,544 మంది అథ్లెట్లతోపాటు, కోచ్‌లు, అధికారులు పరస్పరం వీడ్కోలు చెప్పుకొని ఇంటి ముఖం పట్టారు. ప్రారంభోత్సవంతో పోటీపడుతూ రియో ఒలింపిక్స్ ముగింపు ఉత్సవం, అథ్లెట్ల వీడ్కోలు కవాతు ఆకట్టుకున్నాయి. 28 క్రీడలకు సంబంధించి 306 ఈవెంట్స్‌లో పోటీలు జరగ్గా, అమెరికా పతకాల పంట పండించింది. బ్రిటన్, చైనా వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా, 119 మందిని పంపినప్పటికీ, భారత్ కేవలం రెండు పతకాలతోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది. మహిళల బాడ్మింటన్‌లో పివి సింధు రజతాన్ని, మహిళల రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ కాంస్యాన్ని సాధించారు. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో రెండు రజతం, నాలుగు కాంస్యాలతో మొత్తం ఆరు పతకాలను గెల్చుకున్న భారత్ ఈసారి దారుణంగా విఫలమైంది. పతకాలు సాధిస్తారనుకున్న హేమీహేమీలంతా చేతులెత్తేస్తే, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, రన్నర్ లలితా బాబర్ చివరి వరకూ పోరాడి అందరి ప్రశంసలను అందుకున్నారు. వీరిద్దరూ పతకాలను అందుకోలేకపోయినా, శక్తి వంచన లేకుండా శ్రమించారు. మిగతా వారంతా విహార యాత్రకు వెళ్లిన చందంగా రియోకు వెకువెళ్లి, రిక్త హస్తాలతో తిరుగు ప్రయాణమయ్యారు.