క్రీడాభూమి

గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: రియో ఒలింపిక్స్ మహిళల మారథాన్ పోటీలో పాల్గొన్నప్పుడు భారత అధికారుల నుంచి తనకు ఎలాంటి సహాయం అందలేదని, ఒకానొక దశలో ప్రాణం పోతుందేమోనని భయపడ్డానని అథ్లెట్ ఒపి జైష వాపోయింది. బలవర్ధకమైన ఆహారం, పానీయాన్ని అందించాల్సిన అధికారులు కనీసం గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వలేదంటూ వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మారథాన్ పోటీల్లో పాల్గొంటున్న వారికి నీరు, ఎనర్జీ డ్రింక్స్ ఇవ్వడానికి ప్రతి రెండు కిలోమీటర్ల దూరంలో అన్ని దేశాల స్టాల్స్ ఉంటాయని పిటిఐతో మాట్లాడుతూ చెప్పింది. అన్ని దేశాల స్టాల్స్‌లో ప్రతినిధులు, అధికారులు ఉన్నారని, భారత స్టాల్స్‌లో మాత్రం ఒక్కరూ కనిపించలేదని తెలిపింది. మండుతున్న ఎండలో, విపరీతమైన వేడిని తట్టుకుంటూ, మంచినీరు కూడా లేకుండా రేసును కొనసాగించానని చెప్పింది. ఎనిమిది కిలోమీటర్ల తర్వాత బ్రెజిల్ స్టాల్‌లో మంచినీరు తీసుకున్నట్టు తెలిపింది. ఎండ, ఆకలి, దాహంతో ప్రాణాలు పోతాయేమోనన్న భయం వెంటాడిందని అన్నది. ఒలింపిక్స్ లాంటి మేజర్ ఈవెంట్స్‌లోనూ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఈ రేస్‌ను 2 గంటల 47.10 నిమిషాల్లో పూర్తి చేసిన జైష 89వ స్థానంలో నిలిచింది.

చిత్రం..ఒపి జైష