క్రీడాభూమి

సింధు సాధించాల్సింది ఎంతో ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: సింధు సాధించాల్సింది ఎంతో ఉందని, నిజానికి ఆమె తన సామర్థ్యాన్ని ఇప్పటికీ సంపూర్ణంగా వినియోగించుకోవడం లేదని జాతీయ బాడ్మింటన్ కోచ్ గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. గచ్చిబౌలిలోని తన అకాడెమీలో సింధుతో కలిసి విలేఖరుల సమావేశంలో పాల్గొన్న అతను మాట్లాడుతూ సింధు వయసు కేవలం 21 సంవత్సరాలేనని, కనీసం మరో పదేళ్ల కెరీర్ ఆమె ముందు ఉన్నదని చెప్పాడు. భవిష్యత్తులో దేశానికి ఆమె మరిన్ని పతకాలను సాధించిపెడుతుందని ధీమా వ్యక్తం చేశాడు. దేశంలో కోచ్‌లు అందుబాటులో లేరని, సౌకర్యాల కొరత కూడా తీవ్రంగా వేధిస్తున్నదని అన్నాడు. సరైన ప్రోత్సాహం ఉంటే ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై అద్భుతాలను సృష్టిస్తారని అన్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సింధు స్వర్ణ పతకం సాధిస్తుందని అనుకుంటున్నారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ ఏదీ అసాధ్యం కాదన్నాడు. సింధు దేశం మొత్తానికి చెందిన క్రీడాకారిణి అంటూ ఆంధ్ర, తెలంగాణ వివాదాన్ని సున్నితంగా తోసిపుచ్చాడు. పతకం సాధించేందుకు సింధు ఎంతో కష్టపడిందని, ఎన్నో త్యాగాలు చేసిందని గుర్తుచేశాడు. అదే విధంగా శ్రమిస్తే ఎవరైనా తమతమ రంగాల్లో ఎదుగుతారని అన్నాడు. సింధు విజయం వెనుక ఆమె తల్లిదండ్రుల కృషి కూడా ఎంతో ఉందన్నాడు. సింధు తండ్రి రమణ ప్రతి రోజు పొద్దున నాలుగు గంటలకే నిద్రలేచి, ఆమెను ప్రాక్టీస్‌కు సిద్ధం చేస్తే, తల్లి విజయ రైల్వే ఉద్యోగాన్ని వదులుకొని ఆమె వెన్నంటే ఉందని తెలిపాడు. తల్లిదండ్రులంతా పిల్లలను ఈ తరహాలో ప్రోత్సహిస్తే క్రీడా రంగంలో స్టార్లు అవతరిస్తారని గోపీచంద్ అన్నాడు. దేశంలో ప్రతిభావంతులకు కొదువ లేదని, సరైన సౌకర్యాలు, ప్రోత్సాహం ఉంటే ఏవైనా సాధించగలరని అన్నాడు. వచ్చే ఒలింపిక్స్‌లో భారత్ అద్భుతంగా రాణిస్తుందని అతను ధీమా వ్యక్తం చేశాడు.

చిత్రం..గోపీచంద్