క్రీడాభూమి

నా స్వప్నం సాకారమైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న తన చిరకాల స్వప్నం సాకారమైందని రియోలో రజత పతకాన్ని కైవసం చేసుకొని, సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్న బాడ్మింటన్ స్టార్ పివి సింధు అన్నది. గోపీచంద్ అకాడెమీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఒలింపిక్స్‌కు వెళ్లడం, పతకం సాధించడం తనకు చాలాకాలంగా ఉన్న లక్ష్యాలని చెప్పింది. రియోలో తన కల నెరవేరిందని చెప్పింది. నిరంతర శ్రమ, కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఏదైనా సాధించవచ్చని పేర్కొంది. ఒలింపిక్ పతకాన్ని కైవసం చేసుకోవడానికి తాను ఎంతో కష్టపడ్డానని చెప్పింది. ప్రజల నుంచి ఇంత భారీ స్పందన ఉంటుందని ఎన్నడూ ఊహించలేదని తెలిపింది. తనకు అండగా నిలిచిన తల్లిదండ్రులు, కోచ్ గోపీచంద్‌తోపాటు అభిమానులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని అన్నది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ అన్న వయసుల వారు శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి వరకూ తాను ప్రయాణం చేసిన మార్గంలో అడుగడుగునా కనిపించారని, వారిని చూసిన మనసు ఆనందంతో పొంగిపోతున్నదని సింధు చెప్పింది. ఇదంతా భగవంతుని అనుగ్రహం వల్లే సాధ్యమైందని అన్నది. ఫిట్నెస్ లేదా ఆరోగ్య సమస్యలు లేకపోవడం భగవంతుడి దయేనని చెప్పింది. జలుబు, దగ్గు వంటి సాధారణ రుగ్మతలు వచ్చినా పూర్తి స్థాయిలో రాణించలేమని వ్యాఖ్యానించింది. ‘మనం శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. భగవంతుడి దయ కూడా ఉంటే విజయాలను సాధించవచ్చు’ అన్నది. తనపై తనకు ఎంతో నమ్మకం ఉందని, ఆ నమ్మకంతోనే ఒలింపిక్స్‌కు వెళ్లానని చెప్పింది. ప్రతి మ్యాచ్‌లోనూ నూటికి నూరుశాతం రాణించేందుకు సర్వశక్తులు ఒడ్డానని తెలిపింది. దేశానికి పతకం తెచ్చినందుకు ఎంతో గర్వంగా ఉందని సింధు అన్నది. ఇప్పుడు తన బాధ్యతలు మరింతగా పెరిగాయని చెప్పింది.

చిత్రం..పివి సింధు