క్రీడాభూమి

సింధుకు నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి, కోచ్ గోపీచంద్‌తో కలిసి సోమవారం హైదరాబాద్ చేరుకున్న తెలుగు అమ్మాయి, స్టార్ షట్లర్ పివి సింధుకు కనీవినీ ఎరుగని రీతిలో అపూర్వ స్వాగతం లభించింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు సాగిన భారీ ర్యాలీని తిలకించడానికి వేలాదిగా అభిమానులు కదలివచ్చారు. నినాదాలు చేస్తూ, పూల వర్షం కురిపిస్తూ సింధుకు నీరాజనాలు పలికారు. విమానాశ్రయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు ఆమెకు స్వాగతం పలికారు. శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత విమానాశ్రయం నుంచి గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియం వరకూ విజయోత్సవ ర్యాలీ జరిగింది. దారి పొడుగునా భారీ సంఖ్యలో ప్రజలు నిలబడి సింధును సాదరంగా ఆహ్వానించారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై సింధు, ఆమె తల్లిదండ్రులు విజయ, రమణ, కోచ్ గోపిచంద్ తదితరులు నిల్చొని అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వేల సంఖ్యలో విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకొని ఆమెకు జేజేలు పలికారు. ర్యాలీ కొనసాగిన మార్గంలోని 15 ప్రాంతాల్లో సింధును ఆహ్వానించడానికి ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు.
భారీ కాన్వాయ్..
సింధు వాహనానికి ముందు భారీ కాన్వాయ్ సాగింది. ఆమెకు వివిఐపి స్థాయి భద్రత కల్పించారు. వందల సంఖ్యలో వాహనాలతో కాన్వాయ్ ముందుకు వెళ్లింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 9 గంటలకు బయలుదేరిన సింధు కాన్వాయ్ ఆరంఘార్ చౌరస్తా, టోలిచౌకీ మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు స్టేడియంకు చేరుకున్నది.