క్రీడాభూమి

అది చెత్త స్టేడియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఆగస్టు 24: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్‌కి ఆతిథ్యమిచ్చిన క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానం నాసిరకంగా ఉందని మ్యాచ్ రిఫరీలు ఆండీ పైక్రాఫ్ట్, రంజన్ మదుగలే అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఎలైట్ ప్యానెల్ సభ్యులుగా ఉన్న క్వీన్స్‌పార్క్‌పై అసంతృప్తిని వ్యక్తం చేశారని, అది టెస్టు మ్యాచ్‌ల నిర్వాహణకు ఏమాత్రం అనుకూలంగా లేదని వారు తమ నివేదికలో స్పష్టం చేసినట్టు ఐసిసి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇక్కడ జరిగిన నాలుగో టెస్టు రద్దుకావడంపై ట్రినిడాడ్ అండ్ టొబాగో క్రికెట్ బోర్డు (టి అండ్ టిసిబి) ఇప్పటికే విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. భారీ వర్షం కారణంగా మొదటి రోజు కేవలం 22 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ రెండు వికెట్లకు 62 పరుగులు సాధించింది. ఆతర్వాత నాలుగు రోజులు వరుసగా ఒక్క బంతి కూడా బౌల్ కాకుండానే ఆట రద్దుకాగా, మ్యాచ్ డ్రాగా ముగిసింది. అవుట్ ఫీల్డ్ బురదమయం కావడం, ఫ్లడ్‌లైట్లు సక్రమంగా పని చేయకపోవడం వంటి కారణాలతో ఆటను కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని రిఫరీలు పేర్కొన్నట్టు ఐసిసి తెలిపింది. వర్షం కురిసినప్పుడు మైదానాన్ని కప్పడానికి సరిపడా కవర్లు లేకపోవడాన్ని వారు ప్రస్తావించారు. ఇలావుంటే, విండీస్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో గెల్చుకున్నప్పటికీ, చివరి టెస్టు డ్రాగా ముగిసిన కారణంగా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను చేజార్చుకుంది. పాకిస్తాన్ 111 పాయింట్లతో మొట్టమొదటిసారి టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించగా, భారత్ 110 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నంబర్ వన్ ర్యాంక్‌ను కోల్పోవడం ఒక ఎత్తయితే, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌కు ఆ స్థానం దక్కడం టీమిండియాను అసహనానికి గురి చేసింది. కాగా, ఉద్దేశపూర్వకంగానే అధికారులు మ్యాచ్‌ని డ్రా చేయించారన్న ఆరోపణలున్నాయి.