క్రీడాభూమి

షూటర్ల వైఫల్యానికి బాధ్యత నాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 26: రియో ఒలింపిక్స్‌లో భారత షూటర్లు మూకుమ్మడిగా విఫలం కావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, చైన్ సింగ్, హీనా సిద్ధు వంటి మేటి షూటర్లు ఏ దశలో తమపై ఉన్న అంచనాలకు తగినట్టు రాణించలేకపోవడంపై భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్‌ఆర్‌ఎఐ) అధ్యక్షుడు రణీందర్ సింగ్ విచారం వ్యక్తం చేశాడు. రైఫిల్ సంఘానికి తాను చీఫ్‌గా ఉన్నందున ఈ వైఫల్యాలకు తానే నైతిక బాధ్యత వహిస్తానని అన్నాడు. షూటర్లను తప్పుపట్టవద్దని, తననే దోషిగా భావించాలని చెప్పాడు. 12 మంది సభ్యులతో కూడిన భారత షూటింగ్ బృందం ఒక్క పతకాన్ని కూడా సాధించలేక ఇంటిదారి పట్టడం విచారాన్ని కలిగించిందన్నాడు. ఒలింపిక్స్‌లో అవకాశం కోసం కొంత మంది కోర్టు మెట్లు ఎక్కుతున్నారంటూ రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌పై విమర్శలు చేశాడు. ప్రతిభ ఉన్నా, లేకపోయినా కోర్టులను ఆశ్రయించి మెగా ఈవెంట్స్‌లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకోవడం భారత క్రీడా రంగానికి మంచిది కాదన్నాడు. షూటింగ్‌లో సమర్థులనే తాము ఎంపిక చేశామని చెప్పాడు. ఒలింపిక్స్‌లో ఈ విధంగా విఫలమవుతాయని అనుకోలేదని చెప్పాడు. ఫలితాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉం డవని, జయాపజయాలు క్రీడల్లో భాగమని పే ర్కొన్నాడు. అయతే, షూటింగ్ సమాఖ్య చీఫ్‌గా వైఫల్యాలకు తాను నైతిక బాధ్యత వహించాల్సి న అవసరం ఉందన్నాడు. భవిష్యత్తులో మన షూటర్లు రాణిస్తారని ధీమా వ్యక్తం చేశాడు.