క్రీడాభూమి

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సైనాకు తొమ్మిదో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: ప్రపంచ మాజీ నంబర్ వన్, హైదరాబాదీ సైనా నెహ్వాల్ ర్యాంకింగ్స్‌లో ఒక్కసారిగా నాలుగు స్థానాలను కోల్పోయి, తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం సైనా ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉండగా, రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన తెలుగు అమ్మాయి పివి సింధు పదో స్థానంలో కొనసాగుతున్నది. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ పదో స్థానంలో ఉన్నాడు. రియోలో తనకంటే మెరుగైన స్థానాల్లో ఉన్న క్రీడాకారిణులను సైతం ఓడించి సంచలనం సృష్టించిన సింధును ఫైనల్‌లో ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించిన కరోలినా మారిన్ మహిళల ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. స్పెయిన్‌కు చెందిన ఆమె ఖాతాలో 83,680 పాయింట్లు ఉన్నాయి. పురుషుల విభాగంలో మలేసియా ఆటగాడు లీ చాంగ్
వెయ్ 91,773 పాయింట్లతో నంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు.

పురుషుల్లో ‘టాప్-10’
1. లీ చాంగ్ వెయ్ (మలేసియా/ 91,773 పాయింట్లు), 2. చెన్ లాంగ్ (చైనా/ 86,984 పాయింట్లు), 3. లిన్ డాన్ (చైనా/ 77,188 పాయింట్లు), 4. విక్టర్ ఎక్సెల్సెన్ (డెన్మార్క్/ 74,984 పాయింట్లు), 5. జాన్ ఒ జొర్గెనె్సన్ (డెన్మార్క్/ 68,202 పాయింట్లు), 6. తియాన్ హౌవెయ్ (చైనా/ 66,060 పాయింట్లు), 7. చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ/ 65,785 పాయింట్లు), 8. సన్ వాన్ హో (దక్షిణ కొరియా/ 59,234 పాయింట్లు), 9. టామీ సుగియార్తో (ఇండోనేషియా/ 58,404 పాయింట్లు), 10. కిడాంబి శ్రీకాంత్ (్భరత్/ 63,099).

మహిళల్లో ‘టాప్-10’
1. కరోలినా మారిన్ (స్పెయిన్/ 83,680 పాయింట్లు), 2. లీ జురుయ్ (చైనా/ 81,014 పాయింట్లు), 3. నజోమీ ఒకుహరా (జపాన్/ 78,227 పాయింట్లు), 4. వాంగ్ ఇహాన్ (చైనా/ 77,934 పాయింట్లు), 5. రచానొక్ ఇంతనాన్ (్థయిలాండ్/ 76,904 పాయింట్లు), 6. వాంగ్ షిజియాన్ (చైనా/ 71,754 పాయింట్లు), 7. తాయ్ జూ ఇంగ్ (చైనీస్ తైపీ/ 71,291 పాయింట్లు), 8. సంగ్ జీ హ్యున్ (దక్షిణ కొరియా/ 71,056 పాయింట్లు), 9. సైనా నెహ్వాల్ (్భరత్/ 70,209 పాయింట్లు), 10. పివి సింధు (్భరత్/ 63,099 పాయింట్లు).

చిత్రాలు.. తొమ్మిదో స్థానికి పడిపోయన సైనా నెహ్వాల్

పదో స్థానంలో ఉన్న శ్రీకాంత్