క్రీడాభూమి

‘మియామీ హీట్స్’లో క్రికెటర్ల సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లోరిడా, ఆగస్టు 25: మియామీ హీట్స్ బాస్కెట్‌బాల్ సెంటర్‌లో భారత క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ సందడి చేశాడు. వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో ఆడేందుకు భారత క్రికెట్ జట్టు ఇక్కడికి చేరుకుంది. ఆటగాళ్లకు ఆటవిడుపు లభించడంతో కొంత మంది పరిసర ప్రాంతాలను తిలకించడానికి, మరికొంతమంది షాపింగ్ చేయడానికి వెళ్లారు. కొందరు తాము బస చేసిన హోటల్ గదులకే పరిమితయ్యారు. కాగా, మియామీ హీట్స్ జట్టులోకి ఇటీవలే వచ్చిన టైలర్ జాన్సన్, బ్రియాంట్ వెబెర్ తమ కేంద్రానికి భారత క్రికెటర్లను ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు మియామీ హీట్స్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న వసతులు, ప్రాక్టీస్ విధానాలను పరిశీలించిన తర్వాత ముగ్గురు క్రికెటర్లు కొంత సేపు సరదాగా బాస్కెట్‌బాల్ ఆడారు. తాను పాఠశాలలో చదువుతున్న రోజుల్లో బాస్కెట్‌బాల్ ఆడేవాడినని, ఇనే్నళ్ల తర్వాత మళ్లీ బంతిని పట్టుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అశ్విన్ చెప్పాడు. సెంటర్‌లో ఆటగాళ్లకు సమకూరుస్తున్న సదుపాయాలు బాగున్నాయని భువీ అన్నాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు క్రీడల్లో నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగించడం అద్భుతంగా ఉందని చెప్పాడు. మియామీ హీట్స్‌లో సమయం చాలా సరదాగా గడిచిందని ధావన్ చెప్పాడు. అక్కడ ఉన్న వారికి క్రికెట్ గురించి తెలిపేందుకు ప్రయత్నించానని, అందుకు బదులుగా వారు బాస్కెట్‌బాల్‌ను వివరించారని అన్నాడు. ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవడం ద్వారా ప్రగతి సాధ్యమవుతుందని చెప్పాడు.
27, 28 తేదీల్లో మ్యాచ్‌లు
అమెరికాలో క్రికెట్‌ను అభివృద్ధి చేయాలన్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అభిప్రాయానికి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) సానుకూలంగా స్పందించింది. దీనితో, అమెరికాలో రెండు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను ఆడేందుకు రెండు క్రికెట్ బోర్డులు అంగీకరించాయి. ఈనెల 27, 28 తేదీల్లో సెంట్రల్ బ్రౌవార్ట్ రీజనల్ పార్క్ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతాయి. అమెరికాలో క్రికెట్ మ్యాచ్‌లు కొత్తకాకపోయినా, అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రం ఇదే మొదటిసారి.
రెండో ర్యాంక్‌కు గండి!
వెస్టిండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టి-20 సిరీ స్‌ను టీమిండియా 0-2 తేడాతో కోల్పోతే, ఈ ఫా ర్మె ట్‌లో ప్రపంచ రెండో ర్యాంక్‌ను కోల్పోవాల్సి వ స్తుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ 132 పాయంట్లతో అగ్రస్థానంలో ఉండగా, భారత్ 128 పాయంట్లతో రెండో స్థానంలో నిలిచింది. విండీస్ 122 పాయం ట్లు సంపాదించి మూడో స్థానంలో కొనసాగుతున్న ది. విండీస్ ఈ రెండు మ్యచ్‌లను గెలిస్తే, 127 పా యంట్లతో భారత్‌ను మూడో స్థానానికి నెట్టేస్తుంది. భారత్ 2-0 తేడాతో గెలిస్తే, 132 పాయంట్లతో కివీ స్ సరసన స్థానం దక్కించుకుంటుంది. ఒకవేళ ఈ సిరీస్‌లో చెరొక మ్యాచ్ గెలిచి, 1-1గా నిలిస్తే, భార త్ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంటుంది.

చిత్రం..‘మియామీ హీట్స్’ సెంటర్‌లో బాస్కెట్‌బాల్ ఆటగాళ్లతో
భారత క్రికెటర్లు అశ్విన్, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్