క్రీడాభూమి

వనే్డ, టి-20 ఫార్మెట్స్‌కు దిల్షాన్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఆగస్టు 25: శ్రీలంక స్టార్ బ్యాట్స్‌మన్ దిల్షాన్ తిలకరత్నే వనే్డ, టి-20 ఫార్మెట్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లే తనకు ఈ ఫార్మెట్స్‌లో చివరివని తెలిపాడు. ఆసీస్‌తో శ్రీలంక ఆదివారం చివరి వనే్డ, సెప్టెంబర్ 9న చివరి టి-20 మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లతోనే తన కెరీర్ కూడా ముగుస్తుందని దిల్షాన్ స్పష్టం చేశాడు. ఒకప్పుడు లంక బ్యాటింగ్‌కు వెన్నుముకగా నిలిచిన దిల్షాన్ ఇటీవల కాలంలో విఫలమవుతున్నారు. ప్రత్యేకించి సుమారు రెండు సంవత్సరాలుగా అతను ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. దీనితో రిటైర్ కావాలంటూ శ్రీలంక సెలక్టర్లు అతనిపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. అయితే, ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన తనకు లేదని ప్రకటించిన దిల్షాన్ వారం రోజులు తిరగక ముందే మనసు మార్చుకున్నాడు. కానీ, ఆసీస్‌తో జరిగిన మొదటి రెండు వనే్డల్లో అతను వరసగా 22, 10 చొప్పున పరుగులు చేశాడు. భారీగా పరుగులు సాధించలేకపోవడంతో అతను రిటైర్మెంట్‌ను ప్రకటించక తప్పలేదని విశే్లషకులు అంటున్నారు. వ్యక్తిగత కారణాలతో రిటైర్ అవుతున్నట్టు దిల్షాన్ చెప్తున్నప్పటికీ, హుందాగా తప్పుకోవాలంటూ సెలక్టర్లు తెస్తున్న ఒత్తిడే ఇందుకు కారణమని తెలుస్తోంది.
మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా జట్టులోకి వచ్చినప్పటికీ, తన అద్వితీయ ప్రతిభతో చాలా తక్కువ కాలంలోనే ఓపెనర్ స్థానాన్ని అందిపుచ్చుకున్నాడు. శ్రీలంక తరఫున వనే్డల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు. కుమార సంగక్కర (13,975), సనత్ జయసూర్య (13,364), మహేల జయవర్ధన (12,381) తర్వాతి స్థానంలో ఉన్న దిల్షాన్ ఇప్పటి వరకూ 10,248 పరుగులు సాధించాడు. సమర్థుడిగా పేరు తెచ్చుకున్న అతను 39 ఏళ్ల వయసులో, మునుపటి మాదిరి గొప్పగా రాణించలేకపోతున్నాడని సెలక్టర్లు అంటున్నారు. 2019 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రయోగాలను చేస్తూ, జట్టును ఇప్పటి నుంచి తీర్చిదిద్దాలని ఆలోచిస్తున్న సెలక్టర్లు దిల్షాన్‌ను పక్కకుపెట్టాలన్న నిర్ణయానికి వచ్చేశారని లంక మీడియా కథనం. అవమానకరమైన రీతిలో నిష్క్రమించడం కంటే, ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించడం మేలని అనుకున్న దిల్షాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.
దిల్షాన్ కెరీర్‌లో 87 టెస్టులు ఆడి 5,492 పరుగులు సాధించాడు. 193 పరుగులు అతని అత్యధిక స్కోరు, 10 శతకాలు, 23 అర్ధ శతకాలు అతని ఖాతాలో ఉన్నాయి. ఇప్పటి వరకూ 329 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడిన అతను 10,248 పరుగులు చేశాడు. అజేయంగా 161 అతని అత్యధిక స్కోరు. 78 టి-29 మ్యాచ్‌ల్లో 1,884 పరుగులు చేసిన అతను ఒక శతకాన్ని (104 నాటౌట్) కూడా నమోదు చేశాడు. క్రికెట్‌లో మూడు ఫార్మెట్స్‌లోనూ సెంచరీలు చేసిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో దిల్షాన్ ఒకడు. నిలకడ లేమితోపాటు వయసు మీద పడడం కూడా అతనిపై ఒత్తిడి పెరగ డానికి కారణమైంది.