క్రీడాభూమి

సుధా సింగ్‌కు స్వైన్ ఫ్లూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఆగస్టు 26: రియో ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత స్వైన్ ఫ్లూతో మరో అథ్లెట్ ఆసుప్రతి పాలైంది. మారథాన్ రన్నర్ ఒపి జైష రియోలోనే అనారోగ్యానికి గురికాగా, స్వదేశానికి వచ్చిన తర్వాత ఆమెను ఇక్కడి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. బ్రెజిల్‌ను కుదిపేస్తున్న జికా వైరస్ ఆమెకు సోకిందేమోనన్న అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, చివరికి ఆమెకు స్వైన్ ఫ్లూ వచ్చినట్టు వైద్య పరీక్షల్లో స్పష్ట
మైంది. ఇప్పుడు సుధా సింగ్ కూడా జ్వరం, ఒంటినొప్పులు తదితర లక్షణాలతో ఆసుప్రతిలో చేరింది. ఆమెకు కూడా వైద్య పరీక్షలు జరిపారు. జికా వైరస్ లేదని, స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నదని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. రియో ఒలింపిక్స్ మహిళల 3,000 మీటర్ల స్టీపుల్ చేజ్‌లో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పినప్పటికీ సుధా సింగ్ ఎనిమిదో స్థానంతో రేస్‌ను పూర్తి చేసింది.