క్రీడాభూమి

ఈ ఏడాది చివరి గ్రాండ్ శ్లామ్ ‘యుఎస్’కు స్టార్లు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 27: ఈ ఏడాది చివరి గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీ యుఎస్ ఓపెన్‌కు స్టార్లు సిద్ధమవుతున్నారు. సోమవారం మొదలై సెప్టెంబర్ 11 వరకు జరిగే ఈ మెగా టోర్నీ పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. మహిళల విభాగంలో నిరుటి విజేత ఫ్లావియా పెనెట్టా అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పడంతో, ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ హాట్ ఫేవరిట్‌గా మారింది. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్‌లో ఓడినప్పటికీ, అంతకు ముందు ఫ్రెంచ్ ఓపెన్‌ను సాధించిన అతను టాప్ ఫామ్‌లోనే ఉన్నాడు. సెరెనా ఈ ఏడాది ఇప్పటి వరకూ జరిగిన మొదటి రెండు గ్రాండ్ శ్లామ్స్‌లోనూ ఫైనల్ చేరినప్పటికీ టైటిల్ సాధించలేకపోయిన సెరెనా వింబుల్డన్‌లో విజేతగా నిలిచి సత్తా చాటింది. స్వదేశంలో జరిగే టోర్నీని సాధించాలన్న పట్టుదలతో ఉంది.
ఫామ్‌లో జొకోవిచ్
సెర్బియా ఆటగాడు జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలన్న చిరకాల కలను సాకారం చేసుకున్నాడు. కానీ ఆతర్వాత జరిగిన వింబుల్డన్ టోర్నీలో విఫలమయ్యాడు. అయితే, ఈ ఏడాది రెండు గ్రాండ్ శ్లామ్ టోర్నీలను గెల్చుకొన్న అతను మూడో టైటిల్ కోసం పోరాటం సాగించనున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌లో ఆండీ ముర్రేను 6-1, 7-5, 7-6 తేడాతో ఓడించిన జొకోవిచ్ ఆతర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ అదే ప్రత్యర్థిని చిత్తుచేశాడు. గతంలో 11 పర్యాయాలు ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ కోసం విఫలయత్నం చేసిన జొకోవిచ్ పనె్నండో ప్రయత్నంలో సఫలమయ్యాడు. ఫైనల్‌లో ముర్రేను 3-6, 6-1, 6-2, 6-4 తేడాతో ఓడించాడు. కెరీర్‌లో అతనికి అది 12వ టైటిల్. దీనితోపాటు అతని ఖాతాలో ఆరు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లున్నాయి. అతను 2008, 2011, 2012, 2013, 2015 సంవత్సరాల్లో ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నిలిచి, ఈఏడాది టైటిల్ నిలబెట్టుకున్నాడు. వింబుల్డన్‌ను 2011, 2014, 2015 సంవత్సరాల్లో కైవసం చేసుకున్న అతను నాలుగోసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను అందుకోవాలని ఆశించినప్పటికీ ఫలితం లేకపోయింది. మూడో రౌండ్‌లో శామ్ క్వెర్రీతో తలపడిన అతను 6-7, 1-6, 6-3, 6-7 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. అయితే, వింబుల్డన్‌ను కోల్పోయినంత మాత్రాన అతనిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. యుఎస్ ఓపెన్‌లో అతను డిఫెండింగ్ చాంపియన్‌గానేగాక, టాప్ సీడ్‌గానూ పోరాటానికి సిద్ధమవుతున్నాడు. 2011లో మొదటిసారి, 2015లో రెండోసారి యుఎస్ ఓపెన్‌ను సొంతం చేసుకున్న జొకోవిచ్ ఈసారి హాట్ ఫేవరిట్స్‌లో ఒకడు. కాగా, ఒక క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను సాధించాలన్న అతని కోరిక నెరవేరడం లేదు. 1938లో డాన్ బడ్జ్ తొలిసారి ఒకే ఏడాది నాలుగు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను సాధించి చరిత్ర సృష్టించాడు. ఓపెన్ శకం మొదలైన తర్వాత రాడ్ లెవర్ 1962లో ఒకసారి, 1969లో మరోసారి ఈ ఫీట్‌ను ప్రదర్శించాడు. వీరిద్దరి సరసన చోటు సంపాదించుకునే అవకాశం జొకోవిచ్‌కు నిరుడు అతనికి తృటిలో చేజారింది. ఆస్ట్రేలియా, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ టైటిళ్లను అతను కైవసం చేసుకున్నప్పటికీ, ఫ్రెంచ్ ఓపెన్‌లో అందుకోలేకపోవడంతో క్యాలెండర్ గ్రాండ్ శ్లామ్ పూర్తికాలేదు. ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను కైవసం చేసుకున్నప్పటికీ వింబుల్డన్‌లో రాణించలేకపోయాడు. ఒకే ఏడాది నాలుగు గ్రాండ్ శ్లామ్స్‌ను సాధించడాన్ని మినహాయిస్తే, జొకోవిచ్ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టెన్నిస్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. యుఎస్ ఓపెన్‌లో అతను గట్టిపోటీని ఇవ్వడం ఖాయం.

చిత్రం.. న్యూయార్క్‌లో యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ట్రోఫీలను ఆవిష్కరిస్తున్న డిఫెండింగ్ చాంపియన్లు ఫ్లావియా పెనెట్టా, నొవాక్ జొకోవిచ్