క్రీడాభూమి

వర్షంతో రెండో టి-20 రద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాడెర్‌హిల్ (అమెరికా), ఆగస్టు 28: భారత్, వెస్టిండీస్ జట్ల ఆదివారం నాటి చివరి, రెండో టి-20 మ్యాచ్‌కి వర్షం కా రణంగా రద్దయంది. వర్షం వల్ల కొంత, అవుట్ ఫీల్డ్‌పై గుంట లు ఏర్పడడం వల్ల మరికొంత ఇబ్బంది తలెత్తడంతో, ఆట జ రగడం అసాధ్యంగా మారింది. ఆదివారం ఉదయం జల్లులు కురుస్తుండడంతో ఆట ఆలస్యంగా ఆరంభమైంది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసే వరకూ ఎలాంటి ఆటంకాలు ఏర్పడలేదు. అయతే, భారత్ ఇ న్నింగ్స్ ఆరంభమై, కేవలం రెండు ఓవర్లు బౌల్ అయన వెంటనే మళ్లీ వర్షం కురవడంతో ఆటకు అంత రాయం ఏర్పడింది. కొద్ది సేపటి తర్వాత వర్షం తగ్గినప్పటికీ, అవుట్‌ఫీల్డ్, ప్రత్యేకించి లోగో కోసం కొట్టిన మేకులు బయట కు రావడంతో సమస్యాత్మకంగా మారింది. పరిస్థితిపై ఇరు జట్ల కెప్టెన్లు, అంపైర్లు పదేపదే చర్చలు జరిపారు. పిచ్‌పై అ క్కడక్కగా గుంటలు కనిపించడంతో, ఫీల్డర్లు గాయపడతా రన్న భయంతో మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీ నితో సిరీస్‌ను విండీస్ 1-0 తేడాతో గెల్చుకుంది.
మొదటి టి-20లో మాదిరిగానే రెండో మ్యాచ్‌లోనూ టీమిండియా కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే, మొదటి మ్యాచ్‌లో భారత బౌలర్లపై విరుచుకుపడిన విండీస్ బ్యాట్స్‌మెన్ ఆదివారం నాటి చివరి, రెండో మ్యాచ్‌లో అంతగా రాణించలేకపోయారు. జట్టు స్కోరు 24 పరుగుల వద్ద తొలి వికెట్‌ను ఇవిన్ లూయిస్ (7) రూపంలో విండీస్ కోల్పోయింది. జాన్సన్ చార్లెస్ 25 బంతుల్లో 43 పరుగులు సాధించి, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో ఆజింక్య రహానే క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. ఆతర్వాత బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. పరుగుల వేటలో పడి వికెట్లు పారేసుకోవడంతో విండీస్‌కు భారీ స్కోరు సాధ్యం కాలేదు. లెండల్ సిమన్స్ (19), చివరిలో కెప్టెన్ కార్లొస్ బ్రాత్‌వెయిట్ (18) కొద్ది సేపు భారత బౌలింగ్‌కు ఎదురు నిలిచినా ఫలితం లేకపోయింది. 19.4 ఓవర్లలో విండీస్ 143 పరుగులకు ఆలౌటైంది.
విండీస్‌ను ఓడించి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను సమం చేసుకోవడానికి 144 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ వర్షం కారణంగా ఆటను నిలిపివేసే సమయానికి వికె ట్ నష్టం లేకుండా 15 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 10, ఆజింక్య రహానే 4 పరుగులతో అప్పటికి క్రీజ్‌లో ఉన్నారు.

* రవిచంద్రన్ అశ్విన్ టి-20 కెరీర్‌లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. కీరన్ పోలార్డ్‌ను ఎల్‌బిగా అవుట్ చేసి, తన ఖాతాలో 200వ వికెట్‌ను చేర్చుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన తొలి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. కాగా, లెండల్ సిమన్స్ వికెట్ కూడా అశ్విన్‌కే దక్కింది. సిమన్స్‌ను అవుట్ చేయడం అతనికి ఇది ఐదోసారి. దక్షిణాఫ్రికాకు చెందిన ఎబి డివిలియర్స్‌ను కూడా అశ్విన్ ఐదు పర్యాయాలు అవుట్ చేశాడు.
అశ్విన్

* మొదటి మ్యాచ్‌లో ఒకే ఓవర్ బౌల్ చేసి 32 పరుగుల సమర్పించుకున్న స్టువర్ట్ బిన్నీపై వేటు పడింది. ఆదివారం నాటి మ్యాచ్‌కి అతని స్థానంలో అమిత్ మిశ్రాను తీసుకున్నారు. తన ఎంపిక సరైనదేనని నిరూపించే విధంగా మిశ్రా నాలుగు ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

chitraalu.. అమిత్ మిశ్రా, అశ్విన్