క్రీడాభూమి

వీళ్లని చూసి గర్విస్తున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: రియో ఒలింపిక్స్‌లో అద్భుతంగా రాణించి, దేశాన్ని గర్వంతో తలెత్తుకునేలా చేసిన అమ్మాయిలను చూసి గర్విస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒలింపిక్స్‌లో రజత, కాంస్య పతకాలను గెల్చుకున్న పివి సింధు (బాడ్మింటన్), సాక్షి మాలిక్ (రెజ్లర్) తోపాటు, జిమ్నాస్టిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన దీపా కర్మాకర్, ఈఏడు రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన షూటర్ జీతూ రాయ్ ఆదివారం ప్రధానిని కలిశారు. సోమ వారం క్రీడా పురస్కారాల ప్రదానం జరగను నేపథ్యం వీరు ఇక్కడికి వచ్చారు. కాగా, ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ అమ్మాయిల శక్తిసామర్థ్యాలు ఏమిటో సింధు, సాక్షి, దీప నిరూపించారని అన్నారు. సింధు, సాక్షి పతకాలను కైవసం చేసుకుంటే, దీప భారత్ తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి మహిళా జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందిందని మోదీ అన్నారు. మహిళల హాకీ జట్టు 36 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన విషయాన్ని గుర్తుచేశారు. మారథాన్ ఫైనల్స్‌కు క్వాలిఫై అయిన ఒపి జైష, 3,000 మీటర్ల స్టీపుల్ చేజ్‌లో ఫైనల్స్ చేరిన లలితా బాబర్‌లను కూడా మోదీ ప్రశంసించారు. రాబోయే మూడు ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని, భారత్ అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు అవసరమై చర్యల కోసం ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు మోదీ చెప్పారు.

చిత్రం.. .న్యూఢిల్లీలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలిసిన ఒలింపిక్ స్టార్లు
జీతూ రాయ్, పివి సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్