క్రీడాభూమి

సరైన సమయంలో రిటైర్మెంట్‌పై నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 5: రిటైర్మెంట్‌పై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని భారత వనే్డ, టి-20 జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా టూర్‌కు బయలుదేరుతున్న సందర్భంగా అతను మంగళవారం ఇక్కడ ఏర్పాటైన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతానికి తన దృష్టి మ్యాచ్‌లపైనే ఉంటదని అన్నాడు. రిటైర్మెంట్‌పై ప్రస్తుతానికి ఏమీ ఆలోచించడం లేదని చెప్పాడు. భారత జట్టు పటిష్టంగా ఉందని, రవిచంద్రన్ అశ్విన్ ఫామ్‌లో ఉండడం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నాడు. సురేష్ రైనా వనే్డ జట్టులో లేని విషయాన్ని ప్రస్తావించగా, గుర్‌కీరత్ సింగ్ మాన్ లేదా మనీష్ పాండేకి తుది జట్టులో అవకాశం దక్కవచ్చని అన్నాడు. జట్టు అన్ని విధాలా సమతూకంగా ఉందని తెలిపాడు. ఆసీస్‌కు గట్టిపోటీనిస్తామని, వనే్డ, టి-20 సిరీస్‌లను కైవసం చేసుకుంటామనే నమ్మకం తనకు ఉందని తెలిపాడు.

భారత్ ‘ఎ’కు
కెప్టెన్‌గా రాయుడు
న్యూఢిల్లీ, జనవరి 5: భారత్ ‘ఎ’ జట్టుకు తెలుగువాడైన అంబటి రాయుడు నాయకత్వం వహించనున్నాడు. దేవధర్ ట్రోఫీలో పాల్గొనే భారత్ ‘ఎ’, భారత్ ‘బి’ జట్లను జాతీయల సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. బరోడా తరఫున ఆడుతున్న రాయుడును ‘ఎ’ జట్టుకు, ఉన్ముక్త్ చాంద్‌ను ‘బి’ జట్టుకు కెప్టెన్లుగా ఎంపిక చేసింది. టోర్నమెంట్ ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు జరుగుతుంది.
భారత్ ‘ఎ’: అంబటి రాయుడు (కెప్టెన్), మురళీ విజయ్, జలజ్ సక్సేనా, మన్దీప్ సింగ్, కేదార్ జాదవ్, నమన్ ఓఝా, పర్వేజ్ రసూల్, అమిత్ మిశ్రా, షాబాద్ నదీం, సిద్దార్థ్ కౌల్, శ్రీనాథ్ అరవింద్, వరుణ్ ఆరోన్, కృష్ణ దాస్, సుదీప్ చటర్జీ, ఫైజ్ ఫజల్.
భారత్ ‘బి’: ఉన్ముక్త్ చాంద్ (కెప్టెన్), మాయాంక్ అగర్వాల్, బాబా అపరాజిత్, శ్రేయాస్ అయ్యర్, షెల్డన్ జాక్సన్, దినేష్ కార్తీక్, స్టువర్ట్ బిన్నీ, కర్న్ శర్మ, జయంత్ జాదవ్, ధవళ్ కులకర్ణి, నాథూ సింగ్, శార్దూల్ ఠాకూర్, పవన్ నేగీ, సచిన్ బేమీ, సూర్యకుమార్ యాదవ్.