క్రీడాభూమి

దేశమంతా నాకు అండ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రియో ఒలింపిక్స్‌కు తాను ఒంటరిగా వెళ్లానని, ఇప్పుడు దేశం మొత్తం తన వెంటే అండగా ఉందని రెజ్లర్ సాక్షి మాలిక్ వ్యాఖ్యానించింది. ఇంతటి ఆదరణను తాను ఎన్నడూ ఊహించలేదని చెప్పింది. కోట్లాది మంది ప్రమానురాగాలు తనతో ఉన్నాయని, అవే ఆలంబనగా భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించేందుకు కృషి చేస్తానని చెప్పింది.
ఈ ఏడాదే పెళ్లి!
సాక్షి వివాహం ఈ ఏడాదిలోనే జరగనుంది. అయితే, తేదీనిగానీ, వరుడు ఎవరన్నదిగానీ ఆమె ధ్రువీకరించలేదు. ఇప్పటికే ప్రేమలో పడినట్టు సాక్షి స్పష్టం చేసింది. ఒక రెజ్లర్‌తో తనకు పరిచయం ఉందని, ఈ ఏడాదిలోనే తాము వివాహం చేసుకుంటామని ప్రకటించింది. పెళ్లి తర్వాత కూడా అతని నుంచి తనకు పూర్తి సహాయసహకారాలు ఉంటాయని పేర్కొంది. ఇంతకీ సాక్షి మనసు దోచిన రెజ్లర్ ఎవరో తెలుసుకోవడానికి మీడియా ప్రతినిధులు వేట మొదలుపెట్టారు.