క్రీడాభూమి

స్టార్ షట్లర్‌కు అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: రాజీల్ ఖేల్ రత్న అవార్డును అందుకున్న రోజే సిం ధుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆమెను కమాండెంట్‌గా, బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని సిఆర్‌పిఎఫ్ నిర్ణయంచింది. కేంద్ర ప్రభు త్వానికి ఈ ప్రతిపాదన పంపింది. అక్కడి నుంచి అనుమతి లభించిన వెం టనే సింధు నియామకాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. టీనేజ్ సంచలనంగా అంతర్జాతీయ బాడ్మింటన్ రంగంలోకి అడుగుపెట్టిన పుసర్ల వెంకట సింధు 1995 జూలై 5న జన్మించింది. ఎన్నో అద్భుత విజయాలను సాధించింది. ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు పతకాన్ని అందించిన క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. ఒకసారి కాదు.. రెండు పర్యాయాలు ఈ మెగా ఈవెంట్‌లో కాంస్య పతకాలను అందుకుంది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించడం ద్వారా తన సత్తాను నిరూపించింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డును అందుకుంది.
టెన్నిస్ నుంచి మొదలై..
సింధు సోదరి పివి దివ్య జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ క్రీడాకారిణి. అయితే, వైద్య విద్యను అభ్యసించడానికి ఆమె క్రీడా జీవితానికి స్వస్తి చెప్పింది. రమణ స్వతఃగా క్రీడాకారుడు కావడంతో, తన ఇద్దరు కుమార్తెలను చిన్నతనంలో ఐఎఎస్ అధికారుల టెన్నిస్ క్లబ్ కోర్టులకు తీసుకెళ్లేవారు. ఒక కోచ్ ఇచ్చిన సలహా మేరకు సింధును రైల్వే సిగ్నల్ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోని బాడ్మింటన్ కోర్టుకు పంపారు. ఏడేళ్ల వయసులో సింధుకు తన కంటే పెద్దవారితో కలిసి ఆడే అవకాశం దక్కేది కాదు. గోడనే ప్రత్యర్థిగా మార్చుకొని ప్రాక్టీస్ చేయాలని దివంగత బాడ్మింటన్ కోచ్ మహబూబ్ అలీ ఇచ్చిన సలహాను సింధు తు.చ తప్పకుండా పాటించింది. ఆటలో ఎన్నో మెళకులవలను నేర్చుకుంది. అలీ తర్వాత ఆరిఫ్, గోవర్ధన్ రెడ్డి వద్ద కొంత కాలం సింధు శిష్యరికం చేసింది. అనంతరం గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడెమీలో చేరింది. అక్కడి శిక్షణ సింధు కెరీర్‌ను కీలక మలుపు తిప్పింది.