క్రీడాభూమి

ఖుషీఖుషీగా సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: రాజీవ్ ఖేల్ రత్న అవార్డును స్వీకరించడానికి రాష్టప్రతి భవన్‌కు వచ్చిన తెలుగు అమ్మాయి, భారత బాడ్మింటన్ స్టార్ పివి సింధు ఎంతో సంతోషంగా కనిపించింది. తనను కలిసిన విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా సమాధానం చెప్పింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న తన చిరకాల స్వప్నం సాకారమైందని అన్నది. ఒలింపిక్స్‌లో ఆడాలని, పతకం సాధించాలని తాను చాలాకాలంగా లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పింది. ఇప్పుడు తన కల నెరవేరిందని, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణమే ఇక తన లక్ష్యమని పేర్కొంది. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో కృషి వేస్తే ఏదైనా సాధించవచ్చని అన్నది. అభిమానులకు ఎంతో సహనంతో ఆమె సెల్ఫీలకు ఫోజులిచ్చింది.
ధ్యాన్ చంద్‌కు నివాళి
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘హాకీ మాంత్రికుడు’ ధ్యాన్ చంద్‌కు సింధు ఘన నివాళులర్పించింది. ధ్యాన్ చంద్ జయంతి ఆగస్టు 29వ తేదీని క్రీడా దినోత్సవంగా జరుపుకొంటున్న విషయం తెలిసిందే. న్యూఢిల్లీలోని జాతీయ హాకీ స్టేడియం ముందున్న ధ్యాన్ చంద్ విగ్రహానికి పుష్పగుచ్ఛాలు సమర్పించింది. ధ్యాన్ చంద్ సేవలను గుర్తుచేసుకుంది.

చిత్రం.. ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పిస్తున్న సింధు