క్రీడాభూమి

చదువు వంటబట్టలేదు అదే నా అదృష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 31: తనకు చదువ వంటబట్టలేదని, ఒక రకంగా అదే తన అదృష్టంగా మారిందని జాతీయ బాడ్మింటన్ కోచ్ గోపీచంద్ వ్యాఖ్యానించాడు. హైదరాబాద్‌లో గోపీచంద్ నిర్వహిస్తున్న అకాడెమీలో శిక్షణ పొందిన సైనా నెహ్వాల్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధిస్తే, రియో ఒలింపిక్స్‌లో సింధు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఢిల్లీ సర్కారు బుధవారం ఒలింపిక్స్ విజేతలతోపాటు గోపీచంద్‌ను కూడా సత్కరించింది. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ తాను, తన అన్న చిన్నతనంలో బాడ్మింటన్ ఆడేవాళ్లమని చెప్పాడు. రాష్ట్ర చాంపియన్‌గా ఎదిగిన తన సోదరుడు ఐఐటి ప్రవేశ పరీక్ష రాసి, పాసయ్యాడని, ఆతర్వాత అతను బాడ్మింటన్‌ను విడిచిపెట్టాడని అన్నాడు. తాను ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో విఫలమై, ఆటపై దృష్టి పెట్టానని తెలిపాడు. ఒక రకంగా తనకు అదే వరమైందని వ్యాఖ్యానించాడు. 2001లో ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న తర్వాత, అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన గోపీ 2004లో గచ్చిబౌలిలో బాడ్మింటన్ అకాడెమీని తెరిచాడు. అయితే, అకాడెమీ ఏర్పాటుకు తాను చాలా కష్టపడ్డానని గోపీ అన్నాడు. సాయం కోసం కార్పోరేట్ సంస్థల చుట్టూ తిరిగానని చెప్పాడు. ఒక కంపెనీ మూడు రోజుల పాటు తనను తిప్పి, చివరికి బాడ్మింటన్ వల్ల ప్రయోజనం లేదని వ్యాఖ్యానించడాన్ని గోపీ గుర్తు చేసుకున్నాడు. ‘మూడు రోజుల పాటు రోజూ ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఆ కార్యాలయంలోనే కూర్చున్నాను. ఉన్నతాధికారి ఒకరు నాకు సమయమే ఇవ్వలేదు. మూడో రోజు ఒకరు తన వద్దకు వచ్చి, బాడ్మింటన్‌కు దేశంలో ఆదరణ లేదని, కాబట్టి సాయం అందించలేదని చెప్పాడు. ఆ తర్వాత కార్పొరేట్ సంస్థలను సంప్రదించడం మానుకున్నాను’ అన్నాడు. 2004లో 25 మందితో అకాడెమీ మొదలైందని చెప్పాడు. అప్పట్లో అందరి కంటే సింధు చిన్నదని, ఆమె వయసు కేవలం ఎనిమిదేళ్లని తెలిపాడు. వారిలో పారుపల్లి కశ్యప్ అందరి కంటే ఎక్కువ వయసు గల వాడని, అతని వయసు అప్పడు 15 సంవత్సరాలని గోపీ చెప్పాడు. చాలా తక్కువ కాలంలోనే ఒలింపిక్స్‌లో పతకాలు సాధించగలిగామని అన్నాడు. ‘నా కల నిజమైంది. లక్ష్యాలను చేరుకున్నాను. బహుశా ఇంక రిటైర్ కావాలేమో’ అంటూ చమత్కరించాడు. దేశంలో కోచ్‌లు తగినంత మంది లేరని, సౌకర్యాల కొరత కూడా తీవ్రంగా వేధిస్తున్నదని గోపీ ఆవేదన వ్యక్తం చేశాడు. సరైన ప్రోత్సాహం ఉంటే ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపైకి దూసుకొస్తారని అన్నాడు. సింధు, ఆమె తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని, ఎన్నో త్యాగాలు చేశారని అన్నాడు. పిల్లలు ఆటలాడే విషయంలో తల్లిదండ్రుల వైఖరి మారుతున్నదని, ఇది శుభ సూచకమని గోపీ అన్నాడు. తల్లిదండ్రులంతా పిల్లలను ఇలా ప్రోత్సహిస్తే మేటి క్రీడాకారులను అందించగలమని అన్నాడు.

లంకపై ఆసీస్‌కు వనే్డ సిరీస్
దంబుల్ల్లా, ఆగస్టు 31: శ్రీలంకపై వనే్డ సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సి రీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆసీస్ విజయభేరి మోగించింది. బుధవారం జరిగిన నాలుగో మ్యాచ్‌ని ఆరు వికెట్ల తేడాతో సొంతం చేసుకొని, తిరుగులేని రీతిలో 3-1 ఆధిక్యాన్ని సంపాదించింది. దీనితో చివరిదైన ఐదో వనే్డ నామమాత్రంగా మారింది. నాలుగో వనే్డలో తొలుత బ్యాటింగ్ చేసిన లంక 212 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ధనంజయ డిసిల్వ (76), కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (40) తప్ప మిగతా బ్యాట్స్‌మన్ రాణించలేదు. ఆసీస్ బౌలర్ జాన్ హాస్టింగ్స్ 45 పరుగులకు 6 వికెట్లు కూల్చాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మరో 114 బంతులు మిగిలి ఉండగానే, నాలుగు వికెట్లకు 217 పరుగులు చేసి గెలుపొందింది. జార్జి బెయలీ 90 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, జట్టు విజయం లో కీలక పాత్ర పోషించాడు. ఆరోన్ ఫించ్ (55), ట్రావిస్ హెడ్ (40) కూడా రాణించారు.
పగిలిన హెల్మెట్: ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్ వేసిన బంతి బలంగా తగలడంతో లంక కెప్టెన్ మాథ్యూస్ హెల్మెట్ పగిలింది. అయతే, అదృష్ట వశాత్తు అతనికి గాయం తగల్లేదు