క్రీడాభూమి

మీరు రావడమే మాకు గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 31: తాము ఏర్పాటు చేసిన అభినందన సభకు రియో ఒలింపిక్స్ పతకాల విజేతలు పివి సింధు, సాక్షి మాలిక్ రావడమే తమకు దక్కిన గౌరవం అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మహిళల బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించిన సింధు, రెజ్లింగ్‌లో కాంస్య పతకాన్ని అందుకున్న సాక్షిలను ఆయన బుధవారం ఢిల్లీ సచివాలయంలో ఘనంగా సత్కరించారు. సింధుకు రెండు కోట్లు, సాక్షికి కోటి రూపాయల నజరానాను అందించారు. అదే విధంగా సింధు, సాక్షి కోచ్‌లు గోపీచంద్, మన్దీప్ సింగ్‌లకు చెరి ఐదు లక్షల రూపాయల చెక్కులను అందించారు. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనీకా బత్రా, 4న400 మీటర్ల రిలే అథ్లెట్ లలిత్ మాథుర్‌లకు చెరి మూడు లక్షల రూపాయల బహుమానాన్ని తమ సర్కారు తరఫున ఇచ్చారు. సింధుకు ఫిజియోథెరపిస్టులుగా వ్యవహరిస్తున్న సుబోధ్, కిరణ్ చల్లగుండ్లలను కూడా కేజ్రీవాల్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం సింధు, సాక్షిలను గౌరవించిందని అనుకోవడం లేదని, ఈ కార్యక్రమానికి రావడం ద్వారా వారు తమను గౌరవించారని వ్యాఖ్యానించారు. సింధును తీర్చిదిద్దిన గోపిచంద్‌పై ఆయన ప్రసంసలు కురిపించారు. క్రీడాకారులను తీర్చిదిద్దే విషయంలో ఢిల్లీ ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా గోపిచంద్‌కు కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
మద్దతుకు కృతజ్ఞతలు..
తనకు మద్దతునిచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని సింధు అన్నది. రియో ఒలింపిక్స్ సమయంలో తన వద్ద ఫోన్ లేదని, స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, మ్యాచ్‌లు జరిగిన రోజుల్లో అందరూ టీవీలకు అతుక్కుపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయని తెలుసుకొని ఆశ్చర్యపోయానని చెప్పింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న తన చిరకాల స్వప్నం సాకారమైందని అన్నది. లక్ష్యాలను చేరడానికి నిరంతరం శ్రమించాలని, కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదీ అసాధ్యం కాదని పేర్కొంది. ప్రజల నుంచి ఇంత భారీ స్పందన ఉంటుందని నిజానికి తాను ఊహించలేదని తెలిపింది. తనకు అండగా నిలిచిన తల్లిదండ్రులు, కోచ్ గోపీచంద్‌తోపాటు అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపింది. మరిన్ని విజయాల కు కృషి చేస్తానని అన్నది.

బాడ్మింటన్ స్టార్ సింధుకు జ్ఞాపికను అందచేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
సింధు, మారిన్ మ్యాచ్‌కి
విశేష స్పందన
ముంబయి, ఆగస్టు 31: రియో ఒలింపిక్స్‌లో తెలుగు అమ్మాయి పివి సింధు, ప్రపంచ నంబర్ వన్ కరోలినా మారిన్ మధ్య జరిగిన బాడ్మింటన్ మహిళల సింగిల్స్ మ్యాచ్‌కి విశేష స్పందన లభించింది. ఆ మ్యాచ్‌ని టీవీలో 1.72 కోట్ల మంది తిలకించారని స్టార్ ఇండియా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఒలింపిక్స్‌లో మరే ఇతర పోటీకి ఇంతటి ఆదరణ లభించలేదని పేర్కొంది. రియో ఒలింపిక్స్‌ను చూసిన మొత్తం 19.1 కోట్ల మందిలో కోటి మంది ప్రత్యక్ష ప్రసారాలను తిలకించేందుకు ఆసక్తి ప్రదర్శించారని వివరించింది.