క్రీడాభూమి

కెరీర్‌లోనే గొప్ప ఇన్నింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటింహామ్, ఆగస్టు 31: పాకిస్తాన్‌తో జరిగిన మూడో వనే్డలో తన ఇన్నింగ్స్ చిరస్మరణీయమైనదని 171 పరుగులతో చెలరేగిన ఇంగ్లాండ్ ఓపెనర్ అలెక్స్ హాలెస్ అన్నాడు. అతని విజృంభణకు జో రూట్, జోస్ బట్లర్, ఇయాన్ మోర్గాన్ అర్ధ శతకాలు కూడా జత కలవడంతో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 444 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. వనే్డ చరిత్రలోనే అత్యధిక పరుగులను కొల్లగొట్టి, రికార్డు సృష్టించింది. గతంలో శ్రీలంక 9 వికెట్లకు 443 పరుగులతో నెలకొల్పిన రికార్డును ఇంగ్లాండ్ బద్దలు చేసింది. ఈ భారీ స్కోరును ఛేదించలేకపోయిన పాకిస్తాన్ 42.4 ఓవర్లలో 275 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ 169 పరుగుల భారీ ఆధిక్యంతో విజయభేరి మోగించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. దీనితో ఈ సిరీస్‌లోని మిగతా రెండు వనే్డలు ప్రాధాన్యతను కోల్పో
యాయి. ఇంగ్లాండ్‌కు తిరుగులేని ఆధిక్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన హాలెక్స్ తన కెరీర్‌లో ఈ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నాడు. ఇంగ్లాండ్ తరఫున రాబిన్ సన్ 1993లో ఆస్ట్రేలియాపై 167 పరుగులు సాధించి నెలకొల్పిన అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును అధిగమించడం సంతృప్తినిచ్చిందని హాలెస్ అన్నాడు.
పాక్ బౌలర్లు విఫలం
మూడో వనే్డలో టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకున్న ఇంగ్లాండ్‌ను కట్టడి చేయడంలో పాక్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్ జాసన్ రాయ్ (15) వికెట్ 33 పరుగుల వద్ద కూలగా, ఆతర్వాత జో రూట్‌తో కలిసి హాలెస్ పరుగుల వరద సృష్టించాడు. రెండో వికెట్‌కు వీరు 248 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 122 బంతులు ఎదుర్కొని, 22 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 171 పరుగులు చేసిన హాలెస్‌ను హసన్ అలీ ఎల్‌బిగా అవుట్ చేశాడు. జట్టు స్కోరుకు మరో రెండు పరుగులు జత కలిసిన తర్వాత జో రూట్ అవుటయ్యాడు. 86 బంతుల్లో 85 పరుగులు చేసిన అతని స్కోరులో ఎనిమిది ఫోర్లు ఉన్నాయి. వరుసగా రెండు వికెట్లు కూల్చిన ఆనందం పాకిస్తాన్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. జోస్ బట్లర్, ఇయాన్ మోర్గాన్ మరో వికెట్ కూలకుండా ఇంగ్లాండ్‌ను 50 ఓవర్లలో మూడు వికెట్లకు 444 పరుగుల రికార్డు స్కోరుకు చేర్చారు. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి బట్లర్ 90 (51 బంతులు, 7 ఫోర్లు, 7 సిక్సర్లు), మోర్గాన్ 57 (27 బంతులు, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నారు. వీరిని ఏమాత్రం కట్టడి చేయలేకపోయిన పాక్ బౌలర్లంతా భారీగానే పరుగులు సమర్పించుకున్నారు.
షర్జీల్, అమీర్ పోరాటం వృథా
ఇంగ్లాండ్ నిర్దేశించిన 445 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో పాక్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. తీవ్రమైన ఒత్తిడికి లోనైన వారు షాట్ల ఎంపికలో పొరపాట్లు చేసి వికెట్లు పారేసుకున్నారు. ఓపెనర్ షర్జీల్ ఖాన్ (30 బంతుల్లో 58), చివరిలో మహమ్మద్ అమీర్ (28 బంతుల్లో 58) జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సర్ఫ్‌రాజ్ అహ్మద్ (38), మహమ్మద్ నవాజ్ (34), యాసిర్ షా (26 నాటౌట్) ప్రతిఘటన కూడా ఎక్కువ సేపు కొనసాగలేదు. పాక్ 50 ఓవర్లు పూర్తి గా ఆడలేక, 42.4 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 41 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. అదిల్ రషీద్ 73 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు.

సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 3 వికెట్లకు 444 (అలెక్స్ హాలెస్ 171, జో రూట్ 85, జోస్ బట్లర్ 90 నాటౌట్, ఇయాన్ మోర్గాన్ 57 నాటౌట్, హసన్ అలీ 2/74).
పాకిస్తాన్ ఇన్నింగ్స్: 42.4 ఓవర్లలో 275 ఆలౌట్ (షర్జీల్ ఖాన్ 58, సర్ఫ్‌రాజ్ అహ్మద్ 38, మహమ్మద్ నవాజ్ 34, మహమ్మద్ అమీర్ 58, క్రిస్ వోక్స్ 4/41).

ఇంగ్లాండ్ రికార్డు స్కోరుకు సహకరించిన
అలెక్స్ హాలెస్ (171)

శ్రీలంకతో జరిగిన మూడో వనే్డలోనూ విజయం సాధించిన ఆస్ట్రేలియా హ్యా ట్రిక్‌ను నమోదు చేసింది. 444 పరుగుల భారీ స్కోరు సాధించి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. టెస్టు సిరీస్‌లో అంతంత మాత్రంగానే ఆడిన ఆసీస్ వనే్డ సిరీస్‌లో అద్భుత ప్రతిభ కనబరచడం విశే షం. జట్టు మళ్లీ ఫామ్‌లోకి రావడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆసీస్ ఇదే ఒరవడిని కొనసాగిస్తే ర్యాంకింగ్స్ లో భారత్‌కు కష్టమే.