క్రీడాభూమి

పద్మభూషణ్ అవార్డుకు అద్వానీ పేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డుకు ప్రముఖ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ పేరును భారత బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య (బిఎస్‌ఎఫ్‌ఐ) ప్రతిపాదించింది. భారత పౌర పురస్కారాల్లో మూడో అత్యున్నత అవార్డు పద్మభూషణ్ కోసం నిరుడు కూడా అద్వానీ పేరును సమాఖ్య ప్రతిపాదించింది. కానీ, అవార్డుల కమిటీ అతని పేరును పరిగణలోకి తీసుకోలేదు. ఈఏడాది మరోసారి అతని పేరును పంపినట్టు బిఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి బాలసుబ్రమణియన్ ధ్రువీకరించాడు. కెరీర్‌లో 15 పర్యాయాలు బిలియర్డ్స్, స్నూకర్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిళ్లను కైవసం చేసుకున్న అద్వానీ ఈ అవార్డుకు అన్ని విధాలా అర్హుడని ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. అద్వానీకి 2004లో అర్జున, 2005-06 సీజన్‌లో రాజీవ్ ఖేల్ రత్న, 2009లో పద్మశ్రీ అవార్డులు లభించాయి.