క్రీడాభూమి

ముర్రే దూకుడుకు నిషికోరి బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 8: యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో బ్రిటన్ వీరుడు, ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు ఆండీ ముర్రే దూకుడుకు జపాన్ హీరో కెయ్ నిషికోరి బ్రేక్ వేశాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో అతను 1-6, 6-4, 4-6, 6-1, 7-5 తేడాతో విజయభేరి మోగించి సంచలనం సృష్టించాడు. 2012లో యుఎస్ ఓపెన్ టైటిల్‌ను సాధించిన ముర్రే ఈఏడాది వింబుల్డన్‌లో, ఆతర్వాత ఒలింపిక్స్‌లో విజేతగా నిలిచాడు. యుఎస్ ఓపెన్‌లో హాట్ ఫేవరిట్స్‌లో ఒకడిగా అడుగుపెట్టాడు. కానీ, క్వార్టర్ ఫైనల్స్‌లోనే అతనికి అనూహ్యంగా ఓటమి ఎదురైంది. నిషికోరికి ముర్రేతో ఇది తొమ్మిదో మ్యాచ్‌కాగా, కేవలం
రెండో విజయం. ఒలింపిక్స్ సెమీ ఫైనల్‌లో ముర్రే చేతిలో ఓడిన నిషికోరా ఈ గెలుపుతో ప్రతీకారం తీర్చుకున్నాడు. 17 బ్రేక్ సర్వీసెస్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌ని సొంతం చేసుకోవడం ద్వారా, ఒక గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించిన తొలి ఆసియా క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించే దిశగా మరో అడుగు ముందుకేశాడు.
తీవ్రమైన ఒత్తిడి: క్వార్టర్ ఫైనల్స్‌లో ఇద్దరు ఆటగాళ్లు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. అయితే, ముర్రే అసహనం చాలా స్పష్టంగా కనిపించింది. అతను పలుమార్లు అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. తనను తానే విమర్శించుకుంటూ, గట్టిగా అరుస్తూ, ఏకాగ్రతతో మ్యాచ్‌ని ఆడలేకపోయాడు. మొదటి సెట్‌ను గెల్చుకున్న అతను రెండో సెట్‌లో అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు. మూడో సెట్‌ను మళ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగో సెట్‌లో అతను నిషికోరి నుంచి గట్టిపోటీని ఊహించలేదు. సులభంగా సెట్‌ను గెల్చుకొని, సెమీస్‌కు దూసుకెళతానన్న ధీమాతో ఆడిన ముర్రేకు నిషికోరి ఎదురుదాడి ఆశ్చర్యాన్ని కలిగింది. అతను కోలుకునే లోపుగానే నిషికోరి ఆ సెట్‌ను సాధించాడు. దీనితో చివరిదైన ఐదో సెట్‌పై ఉత్కంఠ పెరిగింది. అప్పటి వరకూ ప్రత్యర్థిని కొంచం తక్కువ అంచనా వేసిన ముర్రే చివరి సెట్‌లో సర్వశక్తులు ఒడ్డాడు. మొదట్లో 0-2 తేడాతో వెనుకబడినప్పటికీ, ఆతర్వాత దాడికి ఉపక్రమించి స్కోరును సమం చేయగలిగారు. ఇరువురు నువ్వానేనా అన్న చందంగా పోరాడడంతో మ్యాచ్ అభిమానులను ఆకట్టుకుంది. ఒత్తిడిని అధిగమించిన నిషికోరి చివరి సెట్‌ను గెల్చుకొని సెమీస్‌లోకి అడుగుపెట్టగా, కన్నీళ్ల పర్యంతమైన ముర్రే టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

చిత్రం.. ముర్రేను ఓడించి సెమీస్ చేరిన జపాన్ ఆటగాడు కెయ్ నిషికోరి