క్రీడాభూమి

సెరెనా విలియమ్స్‌కు డబుల్ లాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 9: స్వదేశంలో జరుగుతున్న యుఎస్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న సెరెనా విలియమ్స్ అనూహ్యంగా ఓటమిపాలైంది. ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను కూడా చేజార్చుకొని, రెండు విధాలా నష్టపోయింది. ప్రపంచ నంబర్ వన్‌గా బరిలోకి దిగిన సెరెనా ద్వితీయ ర్యాంక్ క్రీడాకారిణిగా యుఎస్ నుంచి నిష్క్రమించింది. కెరీర్‌లో 22వ గ్రాండ్ శ్లామ్ టైటిల్స్ గెల్చుకొని, అత్యధిక విజయాల జాబితాలో నంబర్ వన్ స్థానంలో ఉన్న స్ట్ఫె గ్రాఫ్ సరసన చేరాలన్న పట్టుదలతో ఈ టోర్నీలోకి అడుగుపెట్టిన సెరెనాకు సెమీ ఫైనల్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన కరోలినా ప్లిస్కోవా చేతిలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్లిస్కోవా 6-2, 7-6 తేడాతో సెరెనాను ఓడించి, కెరీర్‌లో తొలిసారి యుఎస్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కాగా, రికార్డు స్థాయిలో వరుసగా 187 వారాలపాటు నంబర్ వన్ స్థానంలో కొనసాగిన సెరెనా ద్వితీయ స్థానానికి పడిపోగా, ఏంజెలిక్ కెర్బర్ ఆమె స్థానాన్ని అందిపుచ్చుకుంది. 34 ఏళ్ల వయసులోనూ మంచి ఫామ్‌ను కొనసాగించిన సెరెనాకు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశే్లషకులు సైతం ఊహించారు. కానీ, ఆమె సెమీస్ నుంచే ఇంటిదారి పట్టింది. ఇప్పటి వరకూ 71 టైటిళ్లను అందుకున్న ఆమె ఇటీవలే వింబుల్డన్ టైటిల్‌ను సాధించింది. అదే జోరును కొనసాగించి, యుఎస్ టైటిల్‌ను గెల్చుకోవడం ఖాయమన్న అభిప్రాయాన్ని కల్పించింది. కానీ అభిమానులు తన పై ఉంచిన నమ్మ కాన్ని
నిలబెట్టుకోలేక పోయంది.

ఎవరూ ఊహించని ఆట..

తన క్రీడాజీవితంలో మొదటిసారి ఒక గ్రాండ్ శ్లామ్ సెమీ ఫైనల్ ఆడిన ప్లిస్కోవా ఎవరూ ఊహించని రీతిలో మొదటి సెట్‌ను సునాయాసంగా సొంతం చేసుకుంది. అద్భుతమైన సర్వీసులు, చక్కటి ప్లేసింగ్స్‌తో సెరెనాను ఇబ్బందిపెట్టింది. తొలి సెట్‌ను ఎలాంటి పోరాటం లేకుండానే చేజార్చుకోవడంతో కంగుతిన్న సెరెనా రెండో సెట్‌లో సర్వశక్తులు ఒడ్డింది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని కనబరచేందుకు ప్రయత్నించింది. ఈ టోర్నీలో సెమీస్ చేరడమే గొప్పకాబట్టి, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడిన ప్లిస్కోవా అనుకున్నది సాధించింది. సెరెనాను ఓడించి సంచలనం సృష్టించింది.

ఈ విజయాన్ని నేను ఊహించలేదు. ఇది అద్భుతం. నా క్రీడాజీవితంలో చిరస్థాయిగా గుర్తుండిపోయే అపురూప వరం. సెరెనా విలియమ్స్‌ను ఓడిస్తానని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను 17 గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో ఎన్నడూ మూడో రౌండ్‌ను దాటి ముందుకు వెళ్లలేదు. ఈసారి ఏకంగా ఫైనల్ చేరాను. సెరెనా లాంటి గొప్ప క్రీడాకారిణిని ఓడించడాన్ని మించిన అద్భుతం వేరేది ఉండదు. సెరెనా గొప్పతనం తెలుసుకాబట్టే ఈ విజయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. అయతే, మ్యాచ్ జరుగుతున్నప్పుడు విజయంపై ఆశలు పెరిగాయ. గెలుస్తానన్న నమ్మకం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. చిరస్మరణీయ విజయాన్ని అందించింది. - ప్లిస్కోవా