క్రీడాభూమి

జొకోవిచ్, వావ్రిన్కా ఫైనల్ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 10: ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్, మూడో సీడ్ స్టానిస్లాస్ వావ్రిన్కా ఇక్కడ జరుగుతున్న యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో తలపడనున్నారు. ఈసారి టైటిల్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్న జొకోవిచ్ సెమీ ఫైనల్‌లో పదోసీడ్ గేల్ మోన్ఫిల్స్‌తో తలపడ్డాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు జొకోవిచ్ సులభంగా గెలుస్తాడన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, మ్యాచ్ అందుకు భిన్నంగా కొనసాగింది. మోన్ఫిల్స్ గట్టిపోటీని ఇవ్వడమేగాక, ఒక సెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వేదికలపై ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల నుంచి సమర్థంగా బయటకు వచ్చిన జొకోవిచ్‌కి ఆ అనుభవమే ఉపయోగపడింది. మోన్ఫిల్స్‌ను అతను 6-3, 6-2, 3-6, 6-2 తేడాతో ఓడించి ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు. కెరీర్‌లో 13వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌పై కనే్నసిన అతను యుఎస్‌లో ఇప్పటి వరకూ రెండు పర్యాయాలు (2011, 2015) టైటిల్ సాధించాడు. ఫ్లషింగ్ మెడోస్‌లో ముచ్చటగా మూడోసారి ట్రోఫీని అందుకునే దిశగా దూసుకెళుతున్నాడు.
ఆకట్టుకున్న మ్యాచ్
జొకోవిచ్, మోన్ఫిల్స్ పోరులో విజేత ఎవరన్నది ముందుగానే అంచనా వేసిన ప్రేక్షకులు ఆ మ్యాచ్‌ని సంపూర్ణంగా ఆస్వాదించలేకపోయారు. అయితే, వావ్రిన్కా, కెయ్ నిషికొరి పోటీపడిన సెమీ ఫైనల్ అభిమానులను ఆకట్టుకుంది. నికొలాస్ మాహుత్ వంటి ఆటగాళ్లను చిత్తుచేసి, క్వార్టర్ ఫైనల్స్ చేరిన నిషికొరి సెమీ ఫైనల్ చేరే క్రమంలో బ్రిటిష్ సూపర్ స్టార్ ఆండీ ముర్రేను ఓడించి సంచలనం
సృష్టించాడు. వావ్రిన్కాపై అదే దూకుడును ప్రదర్శించడంతో సెమీ ఫైనల్ ఉత్కంఠ భరితంగా సాగింది. అయితే, నిషికొరి ప్రయత్నాలను తిప్పికొట్టిన వావ్రిన్కా సెమీస్‌ను 4-6, 7-5, 6-4, 6-2 తేడాతో గెల్చుకున్నాడు. మొదటి సెట్‌ను సాధించిన నిషికొరి రెండో సెట్‌లో గట్టిపోటీనిచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. దీనితో నీరసపడిన అతను మూడో సెట్‌లో కొంత వరకు పోరాడాడు. చివరి సెట్‌లో మాత్రం అతను తన స్థాయికి తగిన ఆటను ప్రదర్శించలేక పరాజయాన్ని చవిచూశాడు.
ఫేవరిట్ జోకర్
క్రీడాభిమానులకు ‘జోకర్’గా సుపరచితుడైన జొకోవిచ్‌కే ఫైనల్‌లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రీడా పండితులు జోస్యం చెప్తున్నారు. కెరీర్‌లో 12 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను సాధించిన అతను యుఎస్ ఓపెన్‌లో మూడోసారి విజేతగా నిలిచే ప్రయత్నంలో పడ్డాడు. టైటిల్‌ను నిలబెట్టుకునే క్రమంలో అతను తన అసాధారణ ఫామ్‌ను నిరూపించుకున్నాడు. 2014లో ఆస్ట్రేలియా ఓపెన్, నిరుడు ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను కైవసం చేసుకొని మొదటిసారి యుఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన వావ్రిన్కాతో జొకోవచ్ ఇప్పటి వరకూ 23 పర్యాయాలు తలపడ్డాడు. వాటిలో 19 విజయాలను నమోదు చేయగా, కేవలం నాలుగు సార్లు ఓడాడు. ఈ గణాంకాలతోపాటు జొకోవిచ్ ఫామ్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటే, అతనికే యుఎస్ ఓపెన్ దక్కవచ్చని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీల్లో ఒక్కోసారి అనూహ్య ఫలితాలు వెలువడే అవకాశం లేకపోలేదని స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద జొకోవిచ్ ఫేవరిట్‌గా బరిలోకి దిగుతుండగా, వావ్రిన్కా అతనికి ఏ స్థాయిలో పోటీనిస్తాడన్నది చూడాలి.

చిత్రం.. యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ పురుషుల సింగిల్స్ సెమీస్‌లో గేల్ మోన్ఫిల్స్‌ను ఓడించి ఫైనల్ చేరిన డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్