క్రీడాభూమి

పరుగుల యంత్రం ప్రణవ్‌కు ఎంసిఎ స్కాలర్‌షిప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 6: క్రికెట్ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్‌లో 1000 పరుగుల మైలురాయిని అధిగమించిన బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించిన కెసి గాంధీ హయ్యర్ సెకండరీ స్కూల్ ఆటగాడు ప్రణవ్ ధన్‌వాదేకు ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ) స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. ఐదేళ్లపాటు అతనికి నెలకు 10,000 రూపాయలు చొప్పున స్కాలర్‌షిప్‌ను ఎంసిఎ అధ్యక్షుడు శరద్ పవార్ మంజూరు చేశారు. ఈనెల నుంచి ఆరంభమయ్యే స్కాలర్‌షిప్ 2021 డిసెంబర్ వరకూ కొనసాగుతుందని ఎంసిఎ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. భండారీ కప్ అంతర్ పాఠశాలల క్రికెట్ టోర్నీలో ఆర్య గురుకుల్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రణవ్ 323 బంతులు ఎదుర్కొని, 59 సిక్సర్లు, 129 ఫోర్లతో 1,009 పరుగులు సాధించి, ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.