క్రీడాభూమి

కోహ్లీ నుంచి చాలా నేర్చుకున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: భారత జట్టు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడని న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కాన్ విలియమ్‌సన్ అంటూ, అతని ఆట చూసి తానెంతో నేర్చుకున్నానని చెప్పాడు. విరాట్ గొప్ప క్రికెటర్. మూడు ఫార్మాట్లలోను బౌలింగ్ దాడులను ఎదుర్కోగల అతని సత్తా ప్రత్యేకమైంది. నేను అతడ్ని ఆరాధిస్తాననే మాట నిజం. అతను ఆట చూడడం, అలాంటి ఆడగాడినుంచి నేర్చుకోవడం నాకెంతో ఇష్టం’ అని ప్రపంచంలో నంబర్ 3 బ్యాట్స్‌మన్ అయిన విలియమ్‌సన్ మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు. విలియమ్‌సన్, కోహ్లీ, జో రూట్, స్టీవ్ స్మిత్‌లను ప్రపంచ బ్యాట్స్‌మెన్‌లో ‘బిగ్ ఫోర్’గా చెప్పుకోవచ్చు. అయితే తమ నలుగురిదీ ఒక్కో రకమైన స్టైల్ అని విలియమ్‌సన్ అభిప్రాయ పడ్డాడు. టెస్టుల్లో విలియమ్‌సన్‌ది అద్భుతమైన రికార్డు అనే చెప్పాలి. 14 సెంచరీలు, 4,393 పరుగులతో అతను సరాసరి 51కి పైగానే ఉంది. కాగా, కెప్టెన్సీ, బ్యాటింగ్ ఈ రెండింటినీ సమతుల్యం చేసుకోవడంలో తనకెలాంటి సమస్యలూ లేవని అతను చెప్పాడు. ఐపిఎల్ అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంతో మేలు చేసిందని అతను అంటూ, చాలామంది అంతర్జాతీయ క్రికెటర్లను కలవడం దాని సానుకూల అంశాల్లో ఒకటని అభిప్రాయ పడ్డాడు. కాగా, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్‌ను ఎదుర్కోవడం బ్యాట్స్‌మెన్‌కు కొంచెం ఇబ్బందేననని విలియమ్‌సన్ అంటూ తమ స్పిన్నర్లు కూడా అతి త్వరలోనే కోకాబురా బంతికి అలవాటు పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. కాగా, భారత్‌తో జరిగే సిరీస్‌లో స్పిన్‌దే కీలక పాత్ర అవుతుందనే విషయంలో సందేహం లేదని అతను అన్నాడు. కాగా, భారత్‌తో పింక్ బాల్ డై/నైట్ టెస్టు ఆడడం గురించి చాలానే చర్చించాం కానీ, అది వర్కవుట్ కాలేదని కివీస్ కోచ్ మైక్ హెస్సన్ చెప్పాడు. తాము ఇప్పటికే అలాంటి ఒక టెస్టు ఆడినందున మరో టెస్టు ఆడాలనే ఉత్సుకతతోనే ఉన్నాం కానీ ఏ కారణం చేతనో అది వర్కవుట్ కాలేదని ఆయన చెప్పాడు.
థాయిలాండ్ ఓపెన్ ఫెన్సింగ్‌కు
భారత్ నుంచి నలుగురు
కోయంబత్తూర్, సెప్టెంబర్ 13: తమిళనాడులోని కోయంబత్తూరు నగరానికి చెందిన నలుగురు విద్యార్థులు బ్యాంకాక్‌లో ఈ నెల 16వ తేదీ నుంచి జరిగే థాయిలాండ్ ఓపెన్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ చాంపియన్‌షిప్ ఈ నెల 22వ తేదీ వరకు జరుగుతుందని భారత జట్టు మేనేజర్, కుమారగురు కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ (కెసిటి) ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వి.ఆల్బర్ట్ ప్రేమ్‌కుమార్ తెలిపారు. ఈ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన టి.తమిళ్ కని, కెసిటికి చెందిన ఎం.నివేద, ఎన్.శశికళ, పిఎస్‌జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఎ.బాలాజీ సభ్యులుగా ఉన్నారని ఆల్బర్ట్ మంగళవారం ఇక్కడ ఒక ప్రకటనలో వెల్లడించారు.