క్రీడాభూమి

షరపోవా అప్పీలుపై వచ్చే నెలలో తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాసానే (స్విట్జర్లాండ్), సెప్టెంబర్ 13: డోపింగ్ పరీక్షలో విఫలమైనందుకు తనపై విధించిన రెండేళ్ల నిషేధాన్ని తగ్గించాలని కోరుతూ రష్యా టెన్నిస్ క్వీన్ మరియా షరపోవా చేసుకున్న అప్పీలుపై వచ్చే నెల ఆరంభంలో తీర్పును వెలువరిస్తామని అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సిఎస్‌ఎ) మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ సందర్భంగా షరపోవా ‘మెల్డోనియం’ అనే నిషిద్ధ ఉత్ప్రేరకాన్ని వాడినట్లు మార్చి నెలలో వెల్లడవడంతో ఆమె ప్రతిష్ట మసకబారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో షరపోవాకు, అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటిఎఫ్)కు మధ్య కొనసాగుతున్న వివాదంపై వచ్చే నెల మొదటి వారంలో తీర్పును వెలువరిస్తామని లాసానేలోని ప్రధాన కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో సిఎస్‌ఎ పేర్కొంది. వాస్తవానికి ఈ వ్యవహారంపై జూలై 18వ తేదీనే తీర్పు వెలువడాల్సి ఉండటంతో తనకు విజయం లభించి రియో ఒలింపిక్స్‌లో రష్యా క్రీడా బృందానికి సారథ్యం వహించేందుకు అనుమతి లభిస్తుందని షరపోవా ఆశించింది. అయితే తనపై విధించిన రెండేళ్ల నిషేధాన్ని తగ్గించాలని గట్టిగా వాదన వినిపించేందుకు షరపోవా, ఆమెకు వ్యతిరేకంగా పూర్తిస్థాయిలో వాదన వినిపించేందుకు ఐటిఎఫ్ సిద్ధమవుతుండటంతో ఈ తీర్పు వెలువడటంలో జాప్యం కొనసాగుతోంది.