క్రీడాభూమి

రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌లో వారసత్వ రాజకీయాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, సెప్టెంబర్ 13: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సిఎ)లో వారసత్వ రాజకీయాలకు తెర లేచింది. ఆర్‌సిఎ అధినేతగా వ్యవహరిస్తున్న ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) మాజీ కమిషనర్ లలిత్ మోడీ కుమారుడు రుచిర్ అల్వార్ జిల్లా క్రికెట్ సంఘ (డిసిఎ) అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాడు. గత నెలలో హడావిడిగా నిర్వహించిన డిసిఎ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఎన్నికైన రుచిర్ (22) రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో రుచిర్ విజయం సాధిస్తే తన తండ్రి స్థానంలో ఆర్‌సిఎ అధ్యక్ష పగ్గాలు చేపడతాడు. రాజస్థాన్ క్రీడా చట్టంలోని నిబంధనలకు అనుగుణంగానే రుచిర్ అల్వార్ జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడని, ఈ ఎన్నికకు క్రీడా మండలి పరిశీలకుడు కూడా హాజరయ్యాడని లలిత్ మోదీకి అత్యంత విధేయుడైన డిసిఎ కార్యదర్శి పవన్ గోయల్ చెప్పాడు.
లలిత్ మోడీని అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పటి నుంచి రాజస్థాన్ క్రికెట్ సంఘంపై బిసిసిఐ సస్పెన్షన్‌ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. లలిత్ మోడీ గద్దె దిగినప్పుడు లేదా అధ్యక్ష పదవి నుంచి ఆయనకు ఉద్వాసన పలికినప్పుడు మాత్రమే రాజస్థాన్ క్రికెట్ సంఘంపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తామని బిసిసిఐ చెబుతోంది. రాజస్థాన్ క్రికెట్ సంఘంపై బిసిసిఐ కేవలం సస్పెన్షన్‌తోనే సరిపెట్టకుండా గత మూడేళ్ల నుంచి ఆర్‌సిఎకి అన్ని గ్రాంట్లను నిలిపివేయడంతో పాటు జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియంకు ఈ మూడేళ్ల కాలంలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ను కూడా కేటాయించలేదు. అయితే హైకోర్టు ఆదేశం మేరకు ఆ రాష్ట్రానికి చెందిన క్రికెటర్లు బిసిసిఐ దేశవాళీ సీజన్‌లో రాజస్థాన్ జట్టుగా ఆడుతున్నారు.
ఇదిలావుంటే, బిసిసిఐని ప్రక్షాళన చేసేందుకు జస్టిస్ లోధా కమిటీ చేసిన సఫారసుల ప్రకారం ఆర్‌సిఎ అధ్యక్ష పదవి నుంచి లలిత్ మోడీ వైదొలగాల్సి ఉన్నప్పటికీ ఆ సిఫారసులకు కట్టుబడే ఉంటామని రాజస్థాన్ క్రికెట్ సంఘం ఇటీవల ప్రకటించింది. జస్టిస్ లోధా కమిటీ సూచించిన సంస్కరణలను స్వాగతించిన రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో మొదటిదైన ఆర్‌సిఎ, ఈ సంస్కరణలను అమలు చేయాల్సిందేనని ధృఢ సంకల్పంతో ఉంది.