క్రీడాభూమి

షూటర్ అపూర్వీ ప్రపంచ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: స్వీడిష్ కప్ గ్రాండ్ ప్రీలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకునే క్రమంలో భారత ఏస్ షూటర్ అపూర్వీ చండీలా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అపూర్వీ 211.2 పాయింట్లు సంపాదించి, స్వర్ణ పతకాన్ని అందుకుంది. అంతేగాక, 211 పాయింట్లతో ఇ సిలింగ్ (చైనా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు చేసింది. 207.6 పాయింట్లు సంపాదించిన అస్ట్రిడ్ స్టెఫెనె్సన్‌కు రజతం, 185 పాయింట్లు సాధించిన స్టినె నీల్సెన్‌కు కాంస్య పతకం లభించాయి. ఈ ఏడాది రియో డి జెనీరోలో జరిగే ఒలింపిక్స్‌కు ఇప్పటికే అర్హత సంపాదించిన అపూర్వీ స్వీడిష్ గ్రాండ్ ప్రీలో స్వర్ణ పతకాన్ని సాధించడంపై సంతోషం వ్యక్తం చేసింది. ఒలింపిక్స్‌కు ముందు ఫామ్‌ను కొనసాగించడం తనలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతున్నదని తెలిపింది.