క్రీడాభూమి

అది మంచి జట్టు కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: రియో ఒలింపిక్స్‌కు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) అధికారులు మంచి జట్టును పంపలేదంటూ మిక్స్‌డ్ డబుల్స్ విభాగం గురించి వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. డేవిస్ కప్ డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేనీతో కలిసి శనివారం రాఫెల్ నాదల్, మార్క్ లొపెజ్ జోడీని ఢీకొన్న పేస్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే, తాము చివరి వరకూ గట్టిపోటీనిచ్చామని పేస్ అన్నాడు. సాకేత్‌తో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడడం తనకు ఇదే మొదటిసారని, అయినప్పటికీ అతని నుంచి చక్కటి సహకారం లభించిందని అన్నాడు. ఐదారు నెలలు తనతో కలిసి ఆడితే, ఇదే విధంగా కష్టపడితే, గ్రాండ్ వ్లామ్ టైటిల్‌ను సాధించే అవకాశం సాకేత్‌కు పుష్కలంగా ఉన్నాయని అన్నాడు. రియో ఒలింపిక్స్ టెన్నిస్‌లో భారత్ దారుణంగా విఫలమైన విషయాన్ని ప్రశ్నించగా పేస్ తీవ్రంగా స్పందించాడు. నిజానికి మిక్స్‌డ్ డబుల్స్‌లో మనకు పతకం తప్పక లభిస్తుందని అనుకున్నానని, కానీ, జట్టు ఎంపికే సరిగ్గా లేదని విమర్శించాడు. సానియా మీర్జా, రోహన్ బొపన్న జోడీ మిక్స్‌డ్ డబుల్స్ సెమీ ఫైనల్స్‌లో ఓటిపాలైంది. కాంస్య పతకానికి జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లోనూ పరాజయాన్ని ఎదుర్కొంది. వీరు పేర్లను ప్రస్తావించనప్పటికీ, పతకాన్ని సాధించే అవకాశం ఉన్న విభాగంలోనే జట్టు ఎంపిక సక్రమంగా లేకపోవడం దురదృష్టకరమని పేస్ వ్యాఖ్యానించాడు. ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్స్‌లో అన్ని దేశాలూ అత్యుత్తమ జట్లను పంపుతాయని, మన దేశం మాత్రం ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదని ధ్వజమెత్తాడు. రియో వైఫల్యాలకు జట్టు ఎంపికలో జరిగిన పొరపాట్లు కూడా కారణమేనని 43 ఏళ్ల పేస్ అన్నాడు. డేవిస్ కప్ డబుల్స్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ, కెరీర్‌లో 14 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్న నాదల్, ఇటీవలే గ్రాండ్ శ్లామ్ టైటిల్ సాధించి మంచి ఫామ్‌లో ఉన్న మార్క్ లొపెజ్‌ను ఎదుర్కోవడం ఆషామాషీ వ్యవహారం కాదని అన్నాడు. తాను, సాకేత్ చివరి వరకూ పోరాటం సాగించామని చెప్పాడు. ఒక ప్రశ్నపై స్పందిస్తూ, భవిష్యత్తు గురించి తాను ఏమీ చెప్పలేనని అన్నాడు. ఆసియా క్రీడలు మరో 18 నెలల్లో జరుగుతాయని, ఒలింపిక్స్ నాలుగేళ్ల తర్వాత వస్తాయని చెప్పాడు. ఈ రెండు టోర్నీల్లో తాను పాల్గొంటానో లేదో చెప్పలేనని అన్నాడు. మరీ అంత ముందు చూపు తనకు లేదని వ్యాఖ్యానించాడు.

చిత్రం.. లియాండర్ పేస్