క్రీడాభూమి

ఫెయిర్‌ఫాక్స్‌పై గేల్ దావా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 7: ఫెయిర్‌ఫాక్స్ మీడియాపై పరువునష్టం దావా వేయడానికి వెస్టిండీస్ సూపర్ క్రికెటర్ క్రిస్ గేల్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రముఖ న్యాయవాదిని అతను సంప్రదించినట్టు తెలుస్తున్నది. ఇటీవల బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ తరఫున మ్యాచ్ ఆడిన తర్వాత తనను ఇంటర్వ్యూలో చేసిన మహిళా ప్రెజెంటర్ మెల్ మెక్‌లాగ్లిన్‌తో అసభ్యంగా మాట్లాడడం లైవ్‌లో అందరికీ స్పష్టం వినిపించింది. ఈ సంఘటనపై ఫెయిర్‌ఫాక్స్ మీడియా తీవ్రంగా స్పందించింది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఫిర్యాదును అందుకున్న రెనెగేడ్స్ యాజమాన్యం గేల్‌కు 10,000 డాలర్ల జరిమానా విధించింది. మరోవైపు క్రికెట్ ఆస్ట్రేలియా కూడా గేల్‌పై ఆగ్రహంతో ఉంది. అతనిని బిగ్ బాష్ నుంచి సస్పెండ్ చేయాలన్న డిమాండ్ కూడా జోరందుకుంది. అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో గేల్ ఎదురుదాడికి దిగే ప్రయత్నంలో పడ్డాడు. ఫెయిర్‌ఫాక్స్ మీడియా తన ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నదని ఆరోపిస్తూ కోర్టులో పరువునష్టం దావా వేయడానికి సిద్ధమయ్యాడు.