క్రీడాభూమి

ఐపిఎల్ టీవీ ప్రసార హక్కులకు బిసిసిఐ టెండర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 18: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసే హక్కులను ఇవ్వడానికి టెండర్లు పిలవాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నిర్ణయించింది. ప్రస్తుతం ఈ హక్కులను సోనీ టీవీ నెట్‌వర్క్ (ఎస్‌పిఎన్‌ఐ) వద్ద ఉన్నాయి. 2017 ఐపిఎల్‌తో బోర్డుతో ఎస్‌పిఎన్‌ఐ కాంట్రాక్టు పూర్తవుతుంది. మరోసారి అదే కంపెనీకి హక్కులను ధారాదత్తం చేయకుండా, ఓపెన్ బిడ్స్‌ను పిలవాలని బోర్డు పాలక వర్గం తీర్మానించింది. పాలనా వ్యవహారాలను పాదర్శకంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఈ దిశగా అడుగులు వేశాడు. వచ్చే ఏడాది ఐపిఎల్ ఫైనల్ పూర్తయిన తర్వాత, మే 30న ప్రసార హక్కుల కేటాయింపు పూర్తవుతుందని బోర్డు ప్రకటించింది. గతంలో ఐపిఎల్ హక్కుల అమ్మకం కాంట్రాక్టు పదేళ్ల కాలానికి ఉండేది. అందులోని షరతులను ఉల్లంఘించనంత కాలం అమలయ్యేది. అయతే, ఈసారి కూడా పదేళ్ల కాలానికి కాంట్రాక్టు ఇస్తారా లేక ఆ కాలాన్ని తగ్గిస్తారా అన్న విషయంపై బోర్డు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.