క్రీడాభూమి

లేటు వయసులో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, సెప్టెంబర్ 18: బహ్మాన్ లేటు వయసులోనూ సైక్లింగ్ పట్ల ఆసక్తితో పోటీకి దిగాడు. 2002లో అతను సైక్లింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. 2012 పారాలింపిక్స్‌లో పాల్గొన్నాడు. వయసు మీద పడుతున్నప్పటికీ అతనికి సైక్లింగ్‌పై మక్కువ తగ్గలేదు. ఇరాక్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్న ఈ మాజీ సైనికుడు విధుల నుంచి వైదొలగిన తర్వాత, తన 34వ ఏట సైక్లింగ్‌ను ప్రొఫెషన్‌గా ఎంచుకున్నాడు. రియోలో అతను ట్రయల్ ఈవెంట్‌లో 14వ స్థానంలో నిలిచాడు. ఫైనల్ రేసులో పాల్గొన్న అతను గమ్యానికి మరో 11 కిలోమీటర్ల దూరం ఉండగా, పట్టుతప్పడంతో కిందపడ్డాడు. బలంగా నేలకు గుద్దుకోవడంతో మెడ ఏముక విరిగింది. పక్కటెముకలకు కూడా గట్టి దెబ్బ తగిలింది. హెల్మెట్ ఉండడంతో తలకు గాయాలు తగలకపోయినా, ప్రమాదం ధాటికి అతను అచేతనంగా ఉండిపోయాడు. అధికారులు, సిబ్బంది క్షణాల్లో స్పందించినా ఫలితం లేకపోయింది. గాయాలకుతో గుండెపోటు కూడా తోడుకావడంతో బహ్మాన్ మృతి చెందాడు.

చిత్రం.. ప్రమాదానికి ముందు.. రేసులో పాల్గొన్న ఇరాన్ సైక్లిస్టు బహ్మాన్ గొల్బార్నెజాద్