క్రీడాభూమి

పాక్‌తో సిరీస్‌ల ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత్‌లో ఉగ్రవాద దాడులను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌తో ఇప్పట్లో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే ప్రసక్తే లేదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) చైర్మన్ అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశాడు. శనివారం అతను పిటిఐతో మాట్లాడుతూ ఉగ్రవాదానికి పాక్ మద్దతునిస్తున్నదని, ఫలితంగానే ఉరీలోని భారత సైనిక స్థావరంపై దాడి జరిగిందని అన్నాడు. 18 మంది భారత జవాన్లు మృతి చెందడాన్ని దురదృష్ట సంఘటనగా అభివర్ణించాడు. ఈ పరిస్థితుల్లో పాక్‌తో క్రికెట్ సిరీస్‌ల గురించిన ఆలోచనే లేదని తేల్చిచెప్పాడు. 2008లో ముంబయిపై పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు దాడి జరిపిన తర్వాత ఆ దేశంతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను రద్దు చేసుకుంది. అందులో భాగంగానే క్రికెట్ సంబంధాలకు గూడా గండిపడింది. 2009 నుంచి ఇప్పటి వరకూ పాకిస్తాన్ క్రికెటర్లను తమతమ జట్లలోకి తీసుకోవడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచైజీలు ఏవీ సుముఖత వ్యక్తం చేయడం లేదు. 2012లో పాక్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించి, రెండు టి-20, మూడు వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడింది. అయినప్పటికీ, పాక్‌కు క్రికెట్ జట్టును పంపేందుకు భారత ప్రభుత్వం అంగీకరించలేదు. ఐసిసి షెడ్యూల్ ప్రకారం గత ఏడాది ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాల్సి ఉన్నప్పటికీ, తటస్థ వేదికపై ఇరు దేశాలు ఒక అవగాహనకు రాలేకపోయాయి. ఫలితంగా
ఆ సిరీస్ రద్దయింది. దీనిని అవమానంగా భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) భారత్‌లో జరిగిన టి-20 వరల్డ్ కప్ పోటీలకు జట్టును పంపించేది లేదని భీష్మించుకుంది. కానీ, భారత్‌ను ఎదిరిస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుందనే భయంతో ఆ టోర్నీలో పాల్గొంది. భారత ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోయినా పాక్ సర్కారు పట్టుబట్టలేదు. అంతేగాక, ద్వైపాక్షిక సిరీస్‌లపై పిసిబి ఇప్పటికీ విజ్ఞప్తులు చేస్తునే ఉంది. కనీసం ఈ ఏడాది చివరిలోనైనా ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లు జరగాలని ఆశిస్తున్నది. పాక్‌తో సిరీస్‌కు తాము సుముఖంగానే ఉన్నామని, కేంద్రం నుంచి అనుమతి లభించడమే తరువాయి అని అప్పటి బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ స్పష్టమైన ప్రకటన చేశాడు. కానీ, ఠాకూర్ మాత్రం కేంద్రంపై నెపాన్ని నెట్టకుండా, పాక్‌తో సిరీస్‌ల ప్రసక్తే లేదని చెప్పాడు. ఉగ్రవాదానికి ఆ దేశం సహకరిస్తున్నంత కాలం ద్వైపాక్షిక క్రికెట్‌కు ఆస్కారం ఉండదని అన్నాడు.