క్రీడాభూమి

పారాలింపిక్స్ విజేతలకు పద్మ అవార్డులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: రియోలో ఇటీవల ముగిసిన పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు పద్మ అవార్డులు లభించే అవకాశాలు మెరుగుపడ్డాయి. పురుషుల హై జంప్ విభాగంలో తంగవేలు మరియప్పన్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, వరుణ్ సింగ్ భాటీ కాంస్య పతకం సాధించాడు. జావెలిన్ త్రో ఈవెంట్‌లో దేవేంద్ర ఝజారియాకు స్వర్ణ పతకం లభించింది. మహిళల షాట్‌పుట్‌లో దీపా పాలిక్ రజత పతకాన్ని అందుకుంది. ఈ నలుగురికీ పద్మ అవార్డులు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నట్టు కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ ట్వీట్ చేశారు. వాస్తవానికి ఒలింపిక్స్ విజేతలకు భారత క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డు లభిస్తుంది. కానీ, పారాలింపిక్స్ గురించి ఆ ప్రతిపాదనల్లో ఎక్కడా లేకపోవడంతో, రియోలో పతకాలు సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన నలుగురు పారా అథ్లెట్లకు ఖేల్ రత్న అవార్డు అనుమానంగానే మారింది.

చిత్రం.. హైజంప్‌లో స్వర్ణ, కాంస్య పతకాలు సాధించిన తంగవేలు మరియప్పన్, వరుణ్ సింగ్ భాటీ