క్రీడాభూమి

సెలక్టర్లు ఖోడా, పరాంజపేలకు ఉద్వాసన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 28: జాతీయ సీనయర్ సెలక్షన్ కమిటీ నుంచి గగన్ ఖోడా, జతిన్ పరాంజపేలకు బిసిసిఐ ఉద్వాసన పలకనున్నట్టు తెలుస్తోంది. బోర్డు వర్గాలు అనధికారికంగా తెలిపిన వివరాల ప్రకారం, సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురికావడం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నది. కోర్టుతో ఘర్షణ వైఖరిని అవలంభించరాదన్న నిర్ణయానికి వచ్చిన బోర్డు అధికారులు జాతీయ సెలక్షన్ కమిటీని ముగ్గురు సభ్యులకు కుదించాలని నిర్ణయించారు. లోధా కమిటీ సిఫార్సుల్లోనూ సీనియర్ జట్టులో కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే ఉండాలన్న ప్రతిపాదన ఉంది. అంతేగాక, టెస్టు క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న వారికే స్థానం కల్పించాలని స్పష్టం చేసింది. అయితే, ఈనెల 21న జరిగిన సర్వసభ్య సమావేశంలో లోధా ప్రతిపాదనకు విరుద్ధంగా బిసిసిఐ నిర్ణయాలు తీసుకుంది. ఐదుగురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీని ఎంపిక చేసింది. వీరిలో చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, దేవాంగ్ గాంధీ, శరణ్‌దీప్ సింగ్‌లకు టెస్టులు ఆడిన అనుభవం ఉంది. మిగతా ఇద్దరు, ఖొడా, పరాంజపే టెస్టు క్రికెట్ ఆడలేదు. ఖోడా రెండు, పరాంజపే నాలుగు చొప్పున వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడారు. బోర్డు కార్యదర్శి పదవికి ఎన్నిక జరిగిన విధానంతోపాటు, సెలక్షన్ కమిటీ నియామకాన్ని కూడా లోధా కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. సుప్రీం కోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్ట్‌లో బోర్డు వ్యవహార శైలిని ఎండగట్టింది. ఉద్దేశపూర్వకంగానే సంస్కరణలను వాయిదా వేస్తున్నదని పేర్కొంది. ప్రస్తుత కమిటీ కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నందన, వెంటనే దానిని సస్పెండ్ చేయాలని కోరింది. కమిటీ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్‌పై స్పందించిన సుప్రీం కోర్టు తీవ్ర పదజాలంతో హెచ్చరికలు జారీ చేయడంతో బోర్డు పునరాలోచనలో పడింది. అక్టోబర్ ఆరో తేదీలోగా సిఫార్సుల అమలుకు సంబంధించిన వివరాలను సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో, సెలక్షన్ కమిటీని ముగ్గురు సభ్యులకు కుదించి, దానినే మొదటి అడుగుగా పేర్కోవాలి తీర్మానించినట్టు తెలుస్తోంది. అయితే, వారికి దొడ్డిదారిన అవకాశాన్ని కొనసాగించే అభిప్రాయంలో బోర్డు ఉంది. సెలక్టర్లకు సహాయపడతారంటూ ‘టాలెంటెడ్ స్కౌట్స్’ను నియమించాలని ఇది వరకే తీర్మానించింది. ఖోడా, పరాంజపేలకు ఆ హోదాలో, పరోక్షంగా జాతీయ సెలక్షన్ కమిటీలో అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తున్నది.