క్రీడాభూమి

విండీస్‌తో టి-20 సిరీస్ పాక్ క్లీన్‌స్వీప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబూదబీ, సెప్టెంబర్ 28: వెస్టిండీస్‌తో జరిగిన మూడవ, చివరి మ్యాచ్‌ని కూడా గెల్చుకున్న పాకిస్తాన్ ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో విజయాలను నమోదు చేసి, సిరీస్‌ను దక్కించుకున్న పాక్ చివరి మ్యాచ్‌లోనూ ఆధిపత్యాన్ని కనబరచింది. స్పిన్నర్ ఇమాద్ వసీం 21 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టడంతో విండీస్‌ను పాక్ 103 పరుగులకే కట్టడి చేసింది. మార్లొన్ సామ్యూల్స్ (42 నాటౌట్), కీర్ పోలార్డ్ (16 నాటౌట్) తప్ప మిగతా ఎవరూ వేగంగా పరుగులు రాబట్టలేకపోయారు. ఫలితంగా ఆ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. కాగా, 104 పరుగుల సాదాసీదా లక్ష్యాన్ని పాకిస్తాన్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చి, 43 పరుగులతో నాటౌట్‌గా నిలవడం విశేషం. బాబర్ ఆజమ్ 27 పరుగులతో క్రీజ్‌లో నిలవగా, పాక్ 15.1 ఓవర్లలో ఐదు వికెట్లకు 108 పరుగులు చేసి విజయం సాధించింది.

వచ్చే నెలాఖరు నుంచి ప్రాక్టీస్: సైనా

హైదరాబాద్, సెప్టెంబర్ 28: వచ్చే నెలాఖరులోగా మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెడతానని, గతనెల మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకొని, ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తెలిపింది. ఆపరేషన్ తర్వాత తాను వేగంగా కోలుకుంటున్నానని, అక్టోబర్ నెలాఖరుకు మళ్లీ కోర్టులో అడుగుపెట్టాలని అనుకుంటున్నానని చెప్పింది. ఆరు వారాల విశ్రాంతి తీసుకున్నానని, పూర్తిగా కోలుకోవడానికి మరో నాలుగైదు వారాలు పట్టవచ్చని 26 ఏళ్ల సైనా తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో ఉన్నానని, మరో నెల తర్వాత ఇది మరింతగా పడిపోయే అవకాశం లేకపోలేదని అన్నది. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ నవంబర్‌లో జరిగే టోర్నీలో తాను పాల్గొంటానని తెలిపింది. అయితే, ఫిట్నెస్‌ను పరీక్షించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. ముంబయలోని హెచ్‌ఎన్ రిలయెన్స్ హా స్పిటల్‌లో స్పోర్ట్స్ మెడిసిన్ చీఫ్‌గా సేవలు అంది స్తున్న హీత్ మాథ్యూస్ పర్యవేక్షణలో తన ఫిట్నెస్ తరగతులు కొనసాగు తున్నాయని తెలిపింది. ఫిజి యో చందన్ పోద్దార్ సేలను కూడా తాను మరచి పోలేనని చెప్పింది. సైనా కుడి మోకాలికి దెబ్బతగ లడంతో అక్కడి ఒక చిన్న ఎముక పక్కకు జరింది. దీనితో ఆమెకు ఆపరేషన్ అనివార్యమైంది. చాలా కాలం నొప్పితోనే ఆమె టోర్నీలు ఆడినప్పటికీ, భ విష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముంబయలో శ స్తచ్రికిత్స చేయంచుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్న ఆమె బుధవారం పిటి ఐతో మాట్లాడుతూ, బాడ్మింటన్ ప్రపంచంలో భా రత్ అత్యున్నత శిఖరాలను చేరుకుంటుందన్న ఆ శా భావం వ్యక్తం చేసింది. ప్రతి టోర్నమెంట్ నుం చి ఎన్నో పాఠాలు నేర్చుకోవడం ద్వారా భవిష్యత్ వ్యూహాలను ఖాయం చేసుకోవాలని చెప్పింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన పివి సింధును ఆమె అభినందించింది.

రెండో టెస్టుకూ
నీషమ్ దూరం
కోల్‌కతా, సెప్టెంబర్ 28: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమీ నీషమ్ రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉండడం లేదు. వీపునొప్పితో బాధపడుతున్న కారణంగా అతను కాన్పూర్‌లో జరిగిన మొదటి టెస్టులో ఆడలేదు. అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదని, రెండో టెస్టుకూ అతను ఉండడని న్యూజిలాండ్ జట్టు మేనేజ్‌మెంట్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం అతను పూర్తి ఫిట్నెస్‌తో లేడని తెలి పింది. అందుకే అతనికి పూర్తి విశ్రాంతినివ్వాలని నిర్ణయంచినట్టు ఆ ప్రకటనలో తెలిపింది.