క్రీడాభూమి

కొరియా ఓపెన్ బాడ్మింటన్ శ్రీకాంత్ నిష్క్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, సెప్టెంబర్ 28: కొరియా ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో మొదటి రౌండ్‌లోనే కీలక ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ ఓటమిపాలయ్యాడు. అతనితోపాటు పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎస్ ప్రణయ్, తన్వీ లాడ్ కూడా తమతమ మొదటి రౌండ్ మ్యాచ్‌ల్లోనే పరాజయాలను చవిచూసి, టోర్నీ నుంచి నిష్క్రమించారు. కాగా, అజయ్ జయరామ్, సాయి ప్రణీత్ మొదటి రౌండ్‌ను సమర్థంగా పూర్తి చేసి, భారత్ తరఫున పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకూ చేరిన శ్రీకాంత్ అనూహ్యంగా మొదటి రౌండ్‌లోనే హాంకాంగ్‌కు చెందిన వాంగ్ వింగ్ కీ వినె్సంట్ చేతిలో 10-21, 24-22, 17-21 తేడాతో ఓటమి చవిచూశాడు. మరో మ్యాచ్‌లో, కామనె్వల్త్ గేమ్స్ చాంపియన్ కశ్యప్‌ను చైనా ఆటగాడు తియాన్ హౌవెయ్ 20-22, 21-10, 21-13 తేడాతో ఓడించాడు. స్విస్ ఓపెన్ చాంపియన్ ప్రణయ్ పోరాటానికి చైనీస్ తైదీకి చెందిన వాంగ్ జూ వెయ్ తెరదించాడు. అతను 21-23, 21-17, 21-15 ఆధిక్యంతో ప్రణయ్‌పై గెలిచాడు. కాగా, జయరామ్ 23-21, 21-18 తేడాతో జోన్ హెయాక్ (కొరియా)ను కేవలం 45 నిమిషాల్లో ఓడించాడు. ప్రణీత్ 21-13, 12-21, 21-15 ఆధిక్యంతో సూ జెన్ హవో (తైపీ)పై విజయం సాధించి రెండో రౌండ్ చేరాడు. మహిళల విభాగంలో తన్వీ లాడ్ ను అనా థియే మాడ్సెన్ 21-18, 13-21, 21-18 స్కోరుతో ఓడించింది.