క్రీడాభూమి

ఆసీస్ మాజీ పేసర్ వాకర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, సెప్టెంబర్ 28: బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మాక్స్ వాకర్ చర్మ సంబంధ కేన్సర్ వ్యాధితో మృతి చెందాడు. అతని వయసు 68 సంవత్సరాలు. కెరీర్‌లో 34 టెస్టులు ఆడిన అతను 138 వికెట్లు పడగొట్టాడు. 17 వనే్డ ఇంటర్నేషనల్స్‌లో 20 వికెట్లు కూల్చాడు. వాకర్‌ను ఆసీస్ మాజీ బౌలర్‌గా కంటే ప్రతిభావంతుడైన కామెంటేటర్‌గా, టీవీ ప్రెజెంటర్‌గా చాలా మందికి తెలుసు. జెఫ్ థాంప్సన్, డెన్నిస్ లిల్లీ వంటి సూపర్ ఫాస్ట్ బౌలర్లతో కలిసి కొత్త బంతిని పంచుకున్న ఘనత అతనికి ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత అతను కామంటేటర్‌గా మంచి పేరు సంపాదించాడు. బౌలర్‌గా ఉన్నప్పుడు ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్‌తో ప్రత్యేక గుర్తింపు పొందిన వాటర్, కామెంటేటర్‌గానూ తనదైన ముద్ర వేశాడు. ప్రపంచంలోనే గొప్ప కామెంటేటర్లలో ఒకడిగా కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించాడు.