క్రీడాభూమి

అపూర్వీకి మరో స్వర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: స్వీడన్‌లోని సావ్జోలో జరుగుతున్న స్వీడిష్ కప్ గ్రాండ్ ప్రీలో భారత ఏస్ షూటర్ అపూర్వీ చండీలా వరుసగా రెండో రోజు రెండో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం, మహిళల 10 మీటర్ల ట్రై-సిరీస్ ఈవెంట్‌లో 23 ఏళ్ల అపూర్వీ 208.9 పాయింట్లు సంపాదించి స్వర్ణ పతకాన్ని అందుకుంది. అంతకు ముందు ఆమె మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో 211.2 పాయింట్లతో విజేతగా నిలవడమేగాక, చైనా షూటర్ ఇ సిలింగ్ 211 పాయింట్లతో నెలకొల్పిన రికార్డును బద్దలు చేసిన విషయం తెలిసిందే. అదే ఫామ్‌ను కొనసాగిస్తూ ట్రై-సిరీస్‌లోనూ ఆమె స్వర్ణ పతకాన్ని అందుకుంది.