క్రీడాభూమి

ఆదుకున్న మిడిల్ ఆర్డర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 30: న్యూజిలాండ్‌తో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శుక్రవారం మొదలైన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియాను మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ చటేశ్వర్ పుజారా, ఆజింక్య రహానే ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు అత్యంత కీలకమైన 141 పరుగులు జోడించారు. వీరిద్దరు అర్ధ శతకాలను నమోదు చేయగా, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 86 ఓవర్లలో ఏడు వికెట్లకు 239 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. అయితే, ఉదయం పూట పిచ్‌పై ఉన్న తేమ వల్ల బంతి స్వింగ్ కావడంతో ఓపెనర్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్‌కు సమస్యలు తప్పలేదు. మాట్ హెన్రీ తాను వేసిన మొదటి ఓవర్‌లో నాలుగో బంతికి ధావన్‌ను అవుట్ చేశాడు. అతను సంధించిన బంతి ధావన్ బ్యాట్ అంచులకు తగులుతూ వికెట్లకు తగిలింది. పది బంతులు ఎదుర్కొన్న ధావన్ కేవలం ఒక పరుగు చేసి పెవిలియన్ చేరాడు. నిలకడగా ఆడే మురళీ విజయ్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. అతను 29 బంతులు ఎదుర్కొని, తొమ్మిది పరుగులు చేసి హెన్రీ బౌలింగ్‌లోనే బ్రాడ్లే వాల్టింగ్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వైఫల్యాల బాట వీడలేదు. అతను 28 బంతుల్లో తొమ్మిది పరుగులు చేసి, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో టామ్ లాథమ్‌కు చిక్కాడు. 46 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన భారత్‌కు పుజారా, రహానే అండగా నిలిచారు. కాన్పూర్‌లో జరిగిన మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 62, 78 పరుగులు సాధించిన పుజారా అదే ఫామ్‌ను కొనసాగిస్తూ, మరో అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. రహానేతో కలిసి జాగ్రత్తగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లాడు. అయితే, జట్టు స్కోరు 187 పరుగుల వద్ద పుజారా వికెట్ కూలింది. 219 బంతుల్లో 87 పరుగులు చేసిన అతను నీల్ వాగ్నర్ బౌలింగ్‌లో మార్టిన్ గుప్టిల్ చక్కటి క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరాడు. ధావన్, కోహ్లీ మాదిరిగానే ఇటీవల కాలంలో దారుణంగా విఫలమవుతున్న మరో బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ కేవలం రెండు పరుగులు చేసి వెనుదిరిగాడు. టామ్ లాథమ్ క్యాచ్ అందుకోగా, జీతన్ పటేల్ అతనిని వెనక్కు పంపాడు. జట్టు స్కోరు 200 పరుగుల మైలురాయికి చేరినప్పుడు రహానే వికెట్ కూలింది. అతను 157 బంతులు ఎదుర్కొని, 77 పరుగులు చేసి జీతన్ పడేల్ బౌలింగ్‌లోనే ఎల్‌బిగా అవుటయ్యాడు. గతంలో ఇదే మైదానంలో టెస్టు సెంచరీని సాధించిన అశ్విన్ 33 బంతుల్లో 26 పరుగులు చేసి మాట్ హెన్రీ బౌలింగ్‌లో ఎల్‌బి అయ్యాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఏడు వికెట్లకు 239 పరుగులు సాధించగా, అప్పటికి వృద్ధిమాన్ సాహా (14), రవీంద్ర జడేజా (0) క్రీజ్‌లో ఉన్నారు.
కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ మడు వికెట్లు పడగొట్టగా, జీతన్ పటేల్‌కు రెండు వికెట్లు లభించాయి. ట్రెంట్ బౌల్ట్, నీల్ వాగ్నర్ చెరొక వికెట్ పండుచుకున్నారు.
ఒకే నెలలో
5 హాఫ్ సెంచరీలు
చటేశ్వర్ పుజారా ఈ ఒక్క నెల్లోనే ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో ఐదో అర్ధ శతకాన్ని సాధించాడు. దులీప్ ట్రోఫీలో అతను వరుసగా 166, 31, 259 (నాటౌట్) చొప్పున పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో కాన్పూర్‌లో జరిగిన టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 62, రెండో ఇన్నింగ్స్‌లో 78 చొప్పున పరుగులు సాధించాడు.

స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: శిఖర్ ధావన్ బి మాట్ హెన్రీ 1, మురళీ విజయ్ సి బ్రాడ్లే వాల్టింగ్ బి మాట్ హెన్రీ 9, చటేశ్వర్ పుజారా సి మార్టిన్ గుప్టిల్ బి నీల్ వాగ్నర్ 87, విరాట్ కోహ్లీ సి టామ్ లాథమ్ బి ట్రెంట్ బౌల్ట్ 9, ఆజింక్య రహానే ఎల్‌బి జీతన్ పటేల్ 77, రోహిత్ శర్మ సి టామ్ లాథమ్ బి జీతన్ పటేల్ 2, రవిచంద్ర అశ్విన్ ఎల్‌బి మాట్ హెన్రీ 26, వృద్ధిమాన్ సాహా 14 నాటౌట్, రవీంద్ర జడేజా 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 14, మొత్తం (86 ఓవర్లలో 7 వికెట్లకు) 239.
వికెట్ల పతనం: 1-1, 2-28, 3-46, 4-187, 5-193, 6-200, 7-231.
బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 16-8-33-1, మాట్ హెన్రీ 15-6-35-3, నీల్ వాగ్నర్ 15-5-37-1, మిచెల్ సాంట్నర్ 19-5-54-0, జీతన్ పటేల్ 21-3-66-2.
chitram...
ఆజింక్య రహానే,
చటేశ్వర్ పుజారా