క్రీడాభూమి

వార్నర్ మెరుపు శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 7: రెండు రోజులకుపైగా ఆట వర్షం కారణంగా రద్దుకాగా, డ్రా అనివార్యంగా మారిన చివరిదైన మూడో టెస్టు చివరి రోజున ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ మెరుపు శతకాన్ని నమోదు చేశాడు. మొదటి రోజు ఆట చివరిలో వర్షం కురవగా, రెండో రోజు ఆటలో కేవలం 11.2 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. ఆటను అర్ధాంతరంగా నిలిపివేసే సమయానికి వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లకు 247 పరుగులు చేసింది. ఆతర్వాత వరుసగా రెండు రోజుల ఆట వర్షం కారణంగా రద్దయింది. చివరి రోజైన గురువారం విండీస్ ఆటను కొనసాగించి, 330 పరుగులకు ఆలౌటైంది. దనీష్ రాందిన్ 52 పరుగులకు అవుట్‌కాగా, కెమర్ రోచ్ 15, జెరోమ్ టేలర్ 13 పరుగులు చేసి అవుటయ్యారు. జొమెల్ వారికన్ 21 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియాన్ 120 పరుగులిచ్చి 3, ఒకీఫ్ 63 పరుగులకు 3 చొప్పున వికెట్లు పడగొట్టారు. పాటిన్సన్‌కు రెండు వికెట్లు లభించాయి.
వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ప్రాక్టీస్‌నే లక్ష్యంగా ఎంచుకొని మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జొస్ బర్న్స్ 100 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. బర్న్స్ 26 పరుగులు చేసి వారికన్ బౌలింగ్‌లో రోచ్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. మిచెల్ మార్ష్ 21 పరుగులు చేసి, వారికన్ బౌలింగ్‌లోనే బ్లాక్‌వుడ్‌కు దొరికిపోయాడు. వార్నర్‌కు చక్కటి సహకారాన్ని అందించిన వికెట్‌కీపర్ పీటర్ నెవిల్ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కెరీర్‌లో 16వ శతకాన్ని సాధించే క్రమంలో 150 నిమిషాలు క్రీజ్‌లో నిలిచి, 103 బంతులు ఎదుర్కొని, 11 ఫోర్లు, 2 సిక్సర్లతో వార్నర్ అజేయంగా 122 పరుగులు చేశాడు. మ్యాచ్ డ్రాగా ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండు వికెట్లకు 176 పరుగులు చేసింది. కాగా, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా వార్నర్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఆడమ్ వోగ్స్ ఎంపికయ్యారు.

చిత్రం.. మెరుపు సెంచరీ చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్
డేవిడ్ వార్నర్