క్రీడాభూమి

చెన్నై ఓపెన్ టోర్నీలో సెమీస్‌కు వావ్రింకా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 8: చెన్నైలో జరుగుతున్న ఎయిర్‌సెల్ ఓపెన్ ఎటిపి టోర్నమెంట్‌లో హ్యాట్రిక్ టైటిల్‌పై కనే్నసిన స్విట్జర్లాండ్ క్రీడాకారుడు స్టానిస్లాస్ వావ్రింకా మరోసారి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 4వ స్థానంలో కొనసాగుతున్న వావ్రింకా శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో 6-4, 6-4 వరుస సెట్ల తేడాతో స్పెయిన్‌కు చెందిన ఐదో సీడ్ ఆటగాడు గార్సికా లోపెజ్‌ను మట్టికరిపించాడు. పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్ 77 నిమిషాల్లో ముగిసింది. కాగా, సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో మూడో సీడ్ మూడో సీడ్ ఆటగాడు బెనోయిట్ పయిర్ కూడా వరుస సెట్ల తేడాతో విజయం సాధించాడు. ఇటలీకి చెందిన క్వాలిఫయర్ థామస్ ఫాబియానోతో 80 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో పయిర్ 6-4, 7-5 తేడాతో గెలుపొందాడు. ఫైనల్‌లో స్థానం కోసం అతను శనివారం వావ్రింకాతో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

‘్ఫఫా’ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 163వ స్థానం
న్యూఢిల్లీ, జనవరి 8: ‘శాఫ్’ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో రికార్డు స్థాయిలో ఏడుసార్లు టైటిళ్లు సాధించిన భారత జట్టు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య కొద్ది రోజుల క్రితం తాజాగా విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 163వ స్థానానికి చేరుకుంది. ఆదివారం ముగిసిన శాఫ్ టోర్నీ ఫైనల్‌లో సునీల్ చెత్రి నేతృత్వంలోని భారత జట్టు ర్యాంకింగ్స్‌లో తమ కంటే ఎంతో మెరుగైన స్థానంలో కొనసాగుతున్న డిఫెండింగ్ చాంపియన్ అఫ్గానిస్తాన్‌ను 2-1 గోల్స్ తేడాతో మట్టికరిపించి ఏడోసారి ఈ టైటిల్ కైవసం చేసుకున్న విషయం విదితమే. ఈ విజయంతో భారత జట్టుకు ఎంతో విలువైన రేటింగ్ పాయింట్లు లభించాయి. అఫ్గాన్‌పై విజయానికి ముందు ఈ టోర్నీలో శ్రీలంక, నేపాల్, మాల్దీవుల జట్లపై అప్రతిహత విజయాలు నమోదు చేసిన భారత జట్టు మొత్తం 139 రేటింగ్ పాయింట్లతో ఆసియా ఖండంలోని మెరుగైన జట్ల జాబితాలో 31వ స్థానాన్ని ఆక్రమించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 43వ స్థానంలో కొనసాగుతున్న ఇరాన్ జట్టు ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలువగా, కొరియా (ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 51వ స్థానం), జపాన్ (53), ఆస్ట్రేలియా (59), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (64) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఎయరిండియా జట్టులో ప్రణవ్‌కు స్థానం
న్యూఢిల్లీ, జనవరి 8: దేశవాళీ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో వెయ్యికి పరుగులు చేయడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించడమే కాక, ప్రపంచం నలుమూలలనుంచి ప్రముఖ క్రికెటర్లు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ముంబయి క్రికెటర్ ప్రణవ్ ధనవాడేకు ఎయిరిండియా క్రికెట్ టీమ్‌లో స్థానం లభించింది. వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న తమ విధానానికి అనుగుణంగా ఎయిరిండియా ప్రణవ్‌కు ఈ అవకాశం ఇచ్చిందని ఆ సంస్థ అధికారి ఒకరు చెప్పాడు. ‘మా నిర్ణయాన్ని మేము గురువారమే ప్రణవ్ తల్లిదండ్రులకు తెలియజేసాం. స్కాలర్‌షిప్ ప్రాతిపదికపై ఎయిరిండియా టీమ్‌లో చేరాలని మేము అతడ్ని కోరాం’ అని ఎయిరిండియా అధికారి ఒకరు చెప్పాడు. అయితే ప్రణవ్‌కు ఎయిరిండియా చెల్లించబోయే స్కాలర్‌షిప్ మొత్తం ఎంతో ఆ అధికారి వెల్లడించలేదు. కాగా, ప్రణవ్‌కు సంబంధించి తదుపరి శిక్షణ, విద్యకు సంబంధించిన ఖర్చునంతా భరిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రణవ్ (15)కు జీవితాంతం గుర్తుండే ఒక బహుమతి అందింది. భారత క్రికెట్ లెజెండ్ సచిన్ తెండూల్కర్ తన వ్యక్తిగత ఆటోగ్రాఫ్‌తో పంపిన బ్యాట్‌ను అతను గురువారం అందుకున్నాడు.