క్రీడాభూమి

టీమిండియా శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, జనవరి 8: పరిమిత ఓవర్ల సిరీస్‌లలో ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత జట్టు శుక్రవారం పెర్త్‌లోని డబ్ల్యుఎసిఎ (వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్) గ్రౌండ్‌లో జరిగిన తొలి ట్వంటీ-20 సన్నాహక మ్యాచ్‌లో శుభారంభం చేసింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవెన్ జట్టుతో జరిగిన ఈ డే/నైట్ మ్యాచ్‌లో ధోనీ సేన 74 పరుగులతో విజయం సాధించి తమ పర్యటనను ఘనంగా ఆరంభించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ (74), టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ (74) అర్ధ శతకాలతో విజృంభించారు. దీంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు సాధించిన భారత జట్టు ఆ తర్వాత వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవెన్ జట్టును సమర్ధవంతంగా ప్రతిఘటించింది. ఆతిథ్య జట్టులో ఓపెనర్ ట్రవిస్ బ్రిట్ అజేయంగా 74 పరుగులతో ఒంటరి పోరాటం సాగించినప్పటికీ మిగిలిన వారెవరూ సరిగా రాణించలేకపోయారు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టపోయి 118 పరుగులకే పరిమితమైన వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవెన్ జట్టుకు 74 పరుగుల తేడాతో ఘోర పరాజయం తప్పలేదు.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 6 పరుగులకే రనౌట్‌గా నిష్క్రమించాడు. దీంతో టీమిండియా 12 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది. అయితే నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్‌తో పాటు ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ క్రీజ్‌లో నిలదొక్కుకుని బాధ్యతాయుతంగా ఆడారు. చూడముచ్చటైన షాట్లతో అలరిస్తూ స్కోరుబోర్డును పరుగులు తీయించిన వీరు చెరో అర్ధ శతకాన్ని నమోదు చేసుకోవడంతో పాటు రెండో వికెట్‌కు 149 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరి నిష్క్రమణ తర్వాత యువ బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే 2 పరుగులకే పెవిలియన్‌కు చేరగా, కెప్టెన్ ధోనీ (22), గురుకీరత్ సింగ్ (0) అజేయంగా నిలిచారు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు సాధించింది.
అనంతరం 193 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టును బరీందర్ శరన్ ఆరంభంలోనే చావుదెబ్బ తీశాడు. నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ డిఆర్కీ షార్ట్ (5)తో పాటు కెప్టెన్ విలియమ్ బొసిస్టో (1)లను బరీందర్ స్వల్పస్కోర్లకే పెవిలియన్‌కు చేర్చడంతో ఆతిథ్య జట్టు 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో ఓపెనర్ ట్రవిస్ బ్రిట్ క్రీజ్‌లో నిలదొక్కుకున్నప్పటికీ మిగిలిన వారి నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ (11), నిక్ హోబ్సన్ (5), అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జరోన్ మోర్గాన్ (3), మాథ్యూ కెల్లీ (2) స్వల్పస్కోర్లకే పెవిలియన్‌కు పరిగెత్తడంతో వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టు 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. చివర్లో ట్రెంట్ బ్రిట్ (74), జోష్ నికోలస్ (4) అజేయంగా నిలిచినప్పటికీ అప్పటికే కాలాతీతమైపోయింది. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 118 పరుగులు మాత్రమే సాధించిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవెన్ జట్టు 74 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

---- సంక్షిప్తంగా స్కోర్లు ----
భారత్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 192/4 (శిఖర్ ధావన్ 74, విరాట్ కోహ్లీ 74, మహేంద్ర సింగ్ ధోనీ 22-నాటౌట్). బౌలింగ్: ర్యాన్ డఫీల్డ్ 1/21, మాథ్యూ కెల్లీ 1/31, జోష్ నికోలస్ 1/44. వికెట్ల పతనం: 1-12, 2-161, 3-173, 4-185.
వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 118/6 (ట్రెంట్ బ్రిట్ 74-నాటౌట్, జోష్ ఇంగ్లిస్ 11, విలియమ్ బొసిస్టో 5, నిక్ హోబ్సన్ 5). బౌలింగ్: రవీంద్ర జడేజా 2/13, అక్షర్ పటేల్ 2/13, బరీందర్ శరన్ 2/24. వికెట్ల పతనం: 1-20, 2-26, 3-61, 4-73, 5-83, 6-92.