క్రీడాభూమి

కీలకాంశాలను ఎందుకు ప్రస్తావించరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 19: దేశంలో క్రికెట్ రంగ ప్రక్షాళనకు లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడంలో ఎదురయ్యే పలు కీలక సమస్యలు, క్రికెట్ అభివృద్ధికి అడ్డంకిగా తయారైన అంశాలను సుప్రీం కోర్టులో ఎందుకు వినిపించడం లేదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ) లేఖాస్త్రాన్ని సంధించింది. సిఫార్సుల్లో చాలా వరకు తాము అమలు చేశామని, అయితే, కొన్ని సమస్యలు తెరపైకి వస్తున్నాయని ఆ లేఖలో పేర్కొంది. క్రికెట్ స్టేడియాల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఆయా సంఘాలకు అప్పగించడం వల్ల భారీ మొత్తంలో ఖర్చవుతున్నదని తెలిపింది. స్థానిక ప్రభుత్వాలు వేస్తున్న పన్నులు, ఇతరత్రా ఫీజులతో క్రికెట్ సంఘాల ఖజానాకు గండిపడుతున్నదని తెలిపింది. సంఘం నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం బిసిసిఐ చెల్లించిన 18.92 కోట్ల రూపాయలను ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో ఉంచుతామని, వాటి వినియోగంపై సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాతే తీసుకుంటామని స్పష్టం చేసింది. సీనియర్స్, జూనియర్స్ విభాగంలో పేరు సంపాదించిన కొద్ది మంది క్రికెటర్ల కాంట్రాక్టు, వారికి చెల్లింపుల అంశాన్ని మాత్రమే బిసిసిఐ పర్యవేక్షిస్తున్నదని గుర్తుచేసింది. ఔత్సాహిక క్రికెటర్లను ప్రోత్సహించడం, వారికి సరైన శిక్షణనిచ్చి ఉత్తమ ఆటగాళ్లుగా తీర్చిదిద్దడం వంటి బాధ్యత ఎంసిఎ లాంటి సంఘాలే స్వీకరిస్తున్నాయని తెలిపింది. ఇలాంటి ఎన్నో సమస్యలతో సంఘాలు కొట్టుమిట్టాడుతున్నాయని పేర్కొంది. లోధా సిఫార్సులను అమలు చేసే సమయాల్లో తలెత్తే పరిణామాలను, ఎదురయ్యే సమస్యలను సుప్రీం కోర్టులో ప్రస్తావించాలని కోరింది.