క్రీడాభూమి

ప్రపంచ కప్ కబడ్డీ టోర్నమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, అక్టోబర్ 20: ప్రపంచ కప్ కబడ్డీ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్‌లో థాయిలాండ్‌ను ఢీకొనేందుకు భారత్ సిద్ధమైంది. శుక్రవారం జరిగే ఈ మ్యాచ్‌లో భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఈ టోర్నీలో జయాపజయాల పట్టకను చూస్తే, భారత్ కంటే థాయ్ మెరుగైన స్థితిలో కనిపిస్తుంది. భారత్ ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించగా, రెండు పరాజయాలను చవిచూసింది. థాయ్ ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచింది. ఒక మ్యాచ్‌ని మాత్రమే కోల్పోయింది. స్వదేశంలో, వేలాది మంది అభిమానుల సమక్షంలో ఆడడం భారత్‌కు కలిసొచ్చే అంశం. దీనిని సద్వినియోగం చేసుకొని, భారత జట్టు ఫైనల్ చేరడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో సెమీ ఫైనల్‌లో దక్షిణ కొరియా, ఇరాన్ జట్లు ఢీ కొంటాయి. ఈ మ్యాచ్‌లో కొరియా ఫేవరిట్‌గా బరిలోకి దిగుతుంది. ఈ జట్టు లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయాలను నమోదు చేయగా, ఇరాన్ నాలుగు గెలిచింది. ఒక మ్యాచ్‌ని కోల్పోయింది.